BREAKING
మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి : 19న మండలపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక

చేయి తడిపితే చాలు.. చెక్ పోస్టు దాటెయ్యడమే!!!

Select Suryaa Now
చేయి తడిపితే చాలు.. చెక్ పోస్టు దాటెయ్యడమే!!!

 

ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఏఎంసీ సిబ్బంది.

చెక్ పోస్టులో దందా

ఆటోకు 100 జీపుకి 200 వేనుకు 300 చొప్పున వసూలు

మేజర్ న్యూస్ సాలూరు నవంబర్ 12
 
  నా చేతిలో డబ్బులు పెడితే చాలు ప్రభుత్వానికి చెస్ కట్టాల్సిన అవసరం లేదని ఇది అనాదిగా వస్తున్న ఆచారమని ఏఎంసి సిబ్బంది జొన్నలు వ్యాపారస్తులకు( బ్రోకర్లు) చెప్పకనే చెబుతున్న తీరు పలువురిని ఆశ్చర్యపరచక మానదు. వివరాల్లోకి వెళితే సిజనల్ వ్యాపారంలో భాగంగా ఇప్పుడు అంద్ర, ఒడిస్సా చెక్ పోస్ట్ వద్ద ఉదయం నుండి సాయంత్రం వరకు మొక్క జొన్న బస్తాలు రోజు ఆటో, జీపు, మినీ వ్యాను వివిధ వాహనాల్లో సాలూరు, బొబ్బిలి , పార్వతీపురం, విజయనగరం తదితర ప్రాంతాలకు తరలించడంలో బ్రోకర్ల హడావుడి అంతా ఇంతా కాదు. అందులో భాగంగా అపరాల వ్యాపారం చేసేవారు ఎవరైనా సరే చెక్ పోస్ట్ వద్ద చెస్ కట్టి తీరాల్సిందే. ఈ సీజన్లో రోజు ఏఎంసీకి 40నుండి 50 వేలు ఆదాయం రావాల్సి వుండగా, అందుకు భిన్నంగా సాలూరు పి.కోనవలస చెక్పోస్ట్ ఏఎంసీ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే రోజు ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి కొడుతున్నారనే చెప్పక తప్పదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాలూరు పి.కోనవలస వద్ద వ్యవసాయ మార్కెట్ చెక్పోస్ట్ ను ఏర్పాటు చేసింది. ఎవరైనా ఒడిస్సా నుండి వివిధ వాహనాలలో తరలిస్తున్న అపరాలకు చెక్పోస్ట్ వద్ద చెస్ (చలానా) కట్టి తీరాల్సిందే. అయితే ఒడిస్సా నుండి ఆంద్రాకు వాహనాల్లో తరలిస్తున్న అపరాల వ్యాపారుల వద్ద నుండి  ఎటువంటి చెస్ కట్టనియ్యకుండా అక్కడ  సిబ్బంది ప్రతీ వాహనానికి ఇంత అని లంచం తీసుకుంటున్నారన్నది జగమెరిగిన సత్యం. అలాగే అపరాల వ్యాపారస్తులకు కూడా లంచం తీసుకునే సిబ్బంది ఉంటే ప్రభుత్వానికి చెస్ కట్టాల్సిన పనే ఉండదన్నది వాల్ల ఉద్దేశం .రైతులు వద్ద తక్కువ డబ్బులకు అపరాలు కొని, చెక్పోస్ట్ వద్ద చెస్ కట్టకుండా లాబాలర్జిస్తున్నారు.

మద్యం మత్తులో విధులకు హాజరు..

సాలూరు పి. కోనవలస చెక్ పోస్టులో గురువారం  విధుల్లో వున్న ఉద్యోగి ఉదయం నుండి వచ్చిన అపరాల వాహనాల వద్ద లంచం తీసుకొని పూటుగా మద్యం సేవించి వున్నాడని పలువురి ఆరోపణ. చెక్ పోస్టులో ఉన్న ఉద్యోగి టన్నుకి 240 చొప్పున ఎన్ని టన్నులు వాహనాల్లో తీసుకువెల్తే  అన్నిటన్నులకు డబ్బులు కట్టించుకోవాలి. అదిపోయి చెక్ పోస్టుకు వచ్చిన ప్రతీ వాహానానాకి 100, 200, 300 చొప్పున లంచం వసూళ్లు చేస్తున్నారన్నది సమాచారం.. ఈ విషయంపై సమాచారం కోసం ఏఎంసి సెక్రెటరీ వద్దకు వెళితే ఆయన అందుబాటులో లేరు.