BREAKING
వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి :

గ్రంథాలయ వారోత్సవాలకు అధికారులకు ఆహ్వానం

Select Suryaa Now
గ్రంథాలయ వారోత్సవాలకు అధికారులకు ఆహ్వానం

 

ఆహ్వాన పత్రికలను అందజేసిన మధుసూదనరావు  

వారోత్సవాలను విజయవంతం చేయాలని వినతి

గరుగుబిల్లి, నవంబర్ 12, మేజర్ న్యూస్:జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని మండల స్థాయి అధికారులకు గరుగుబిల్లి శాఖ గ్రంథాలయ నిర్వాహకులు నల్ల మధుసూదనరావు ఆహ్వాన పత్రికలను అందజేశారు.ఈ మేరకు గురువారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి నడిమింటి సూర్యనారాయణ, ఎంపీడీవో కార్యాలయం ఏవో నాలి అర్జునరావు,స్థానిక ఎస్ ఐ షేక్ ఫక్రుద్దీన్, గరుగుబిల్లి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపాల్ అరసాడ రజనీకుమారితో పాటు తదితర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిన శాఖ గ్రంథాలయo నిర్వాహకులు నల్ల మధుసూదనరావు మర్యాదపూర్వకంగా కలిసి వారోత్సవాల ఆహ్వాన పత్రికలను అందజేశారు. గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభోత్సవానికి మరియు ముగింపు వేడుకలకు అధికారులు తప్పనిసరిగా హాజరై విద్యార్థులు ప్రోత్సహించాలని మధుసూదన రావు కోరారు.
ఈ సందర్భంగా గ్రంథాలయ నిర్వాహకులు మాట్లాడుతూ, సమాజంలో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడానికి ప్రతి సంవత్సరం గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు శాఖా గ్రంధాలయంలో గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం మరియు క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమాలకు మండల అధికారులు తప్పకుండా విచ్చేసి, విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు.
దీనిపై స్పందించిన మండల అధికారులు, గ్రంథాలయ వారోత్సవాల నిర్వహణకు తమ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.