ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ
పాలకొండ, మేజర్ న్యూస్ విశాఖపట్నంలో నిర్వహించిన CII సమ్మిట్ సందర్భంగా పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ నిమ్మక జయకృష్ణ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి తో కొద్దిసేపు సమావేశమై పరస్పరం మాట్లాడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ కూడా పాల్గొన్నారు.రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, యువతకు ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా నిర్వహించిన ఈ సమ్మిట్‌లో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ప్రత్యేకంగా నిలిచింది.