BREAKING
మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి : 19న మండలపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక

అభివృద్ధి ఆవిష్కరణలకు అంతర్జాతీయ గుర్తింపు!

Select Suryaa Now
అభివృద్ధి ఆవిష్కరణలకు అంతర్జాతీయ గుర్తింపు!

 

నీతి ఆయోగ్ - JICA జపాన్ అధ్యయన పర్యటనకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎంపిక

పార్వతీపురం, నవంబర్ 12 మేజర్ న్యూస్ : నీతి ఆయోగ్ అభివృద్ధి కార్యక్రమాల అమలులో విశేష ప్రతిభ కనబరిచినందుకు డా. ఎన్. ప్రభాకర రెడ్డి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. నీతి ఆయోగ్, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న జపాన్ అధ్యయన పర్యటనకు దేశవ్యాప్తంగా ఎంపికైన 18 మంది ఐఏఎస్ అధికారుల్లో ఆయనకు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పర్యటనకు ఎంపికైన ఐఏఎస్ అధికారిగా ఆయన నిలిచారు. ఈ పర్యటనకు అవసరమైన శాఖాపరమైన అనుమతులు కూడా పొందారు. నీతి ఆయోగ్ అమలు చేస్తున్న ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం, ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమం  కింద నిర్దేశించిన కీలక పనితీరు సూచికల సాధనలో ఆయన ఆధ్వర్యంలో విశేష పురోగతి నమోదైంది. ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాల్లో లక్ష్యాల సాధనకు చేపట్టిన చర్యలు ఈ గుర్తింపునకు ప్రధాన కారణంగా నిలిచాయి.
ముఖ్యంగా ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి కార్యక్రమం కింద నిర్వహించిన డెల్టా ర్యాంకింగ్‌లో మూడు సందర్భాల్లో ప్రథమ అవార్డులు సాధించడం విశేషం. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం, క్షేత్రస్థాయి పర్యవేక్షణ, ఫలితాల ఆధారిత కార్యాచరణతో పాటు సమగ్ర పనితీరు ద్వారా రూ.8 కోట్ల ప్రోత్సాహక నిధులు కూడా సాధించారు.
జపాన్ అధ్యయన పర్యటనలో భాగంగా అక్కడి ఆధునిక పరిపాలనా విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, ప్రజారోగ్యం, వ్యవసాయ ఆధునికీకరణ, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల నిర్వహణ వంటి అంశాలను అధ్యయనం చేయనున్నారు. అక్కడ అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను భారతదేశంలోని ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల అభివృద్ధికి అన్వయించే అవకాశాలను పరిశీలించనున్నారు. మూడుసార్లు ప్రథమ అవార్డులు, రూ.8 కోట్ల ప్రోత్సాహక నిధుల సాధనతో పాటు అంతర్జాతీయ అధ్యయన పర్యటనకు ఎంపిక కావడం జిల్లా అభివృద్ధి కార్యక్రమాల అమలుకు లభించిన ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. ఈ విజయం ప్రభుత్వ శాఖలు, క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది సమష్టి కృషికి నిదర్శనంగా భావిస్తున్నారు.