BREAKING
నవంబర్ 14 నుండి 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు విజయవంతం చేయండి గ్రంథాలయ వారోత్సవాలకు అధికారులకు ఆహ్వానం మండల పరిషత్ పీఠంపై"మరడాన"ముద్ర.. సంక్రాంతి బరిలో సందడికి సిద్ధం.. రెండు నెలల ముందే ప్రమోషన్స్ షురూ చేసిన అనిల్ రావిపూడి ఆటపాటలతో కూడిన బోధనపై అంగన్వాడీలకు ప్రత్యేక శిక్షణ...ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనకదుర్గ. పరిషత్ పోరులో కీలక ఘట్టం.. ఎంపీపీ ఎన్నికకు వేళాయే లాయర్‌గా కీర్తి సురేశ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్.. సత్యవాన్ సావిత్రి ట్రైలర్ విడుదల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు మన్యం సవారి లో ఎన్ జి ఓ నాయుకులు గుండె ఆరోగ్యానికి వెల్లుల్లి ఎంతవరకు మేలు చేస్తుంది? వైద్యులు చెబుతున్న అసలు నిజాలు ఇవే మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మృతి టీడీపీకి, రాజకీయ రంగానికి తీరని లోటు చేయి తడిపితే చాలు.. చెక్ పోస్టు దాటెయ్యడమే!!! అభివృద్ధి ఆవిష్కరణలకు అంతర్జాతీయ గుర్తింపు! ఉత్తరాంధ్ర టైగర్ శత్రుచర్ల విజయరామరాజు మరణం తీరని లోటు

రాజమహేంద్రవరం కు ఎన్నికల

Select Suryaa Now
రాజమహేంద్రవరం కు ఎన్నికల

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల సందడి మొదలుకానుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో నగర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కనున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 14 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. నవంబరు 26న పోలింగ్‌, 30న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లపై నగరపాలక సంస్థ యంత్రాంగం దృష్టి సారించింది. ఎన్నికల షెడ్యూల్‌తో పాటు వార్డుల వారీగా రిటర్నింగ్‌ అధికారులు, నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వివరాలను కమిషనర్‌ రాహుల్‌ మీనా వెల్లడించారు.

14 నుంచి నామినేషన్ల పర్వం:

ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ఈ నెల 14న ప్రారంభం కానుంది. 14, 15, 16 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. చివరి రోజైన 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత నామినేషన్లు స్వీకరించరు. 17న ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఇచ్చారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.

26న ఓటింగ్‌.. 30న ఫలితాలు:

ఈ నెల 26న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఏదైనా కారణంతో పోలింగ్‌ నిర్వహణలో అంతరాయం ఏర్పడితే 27న రీపోలింగ్‌ చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. నవంబరు 30న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. దీంతో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో ఆశావహులు, రాజకీయ పార్టీల్లో సందడి నెలకొంది.

మూడు వార్డులకు ఒక అధికారి:

నగరపాలక సంస్థ పరిధిలోని మొత్తం 72 వార్డులకు 24 మంది రిటర్నింగ్‌ అధికారులను నియమించారు. ఒక్కో అధికారికి మూడు వార్డుల చొప్పున బాధ్యతలు అప్పగించారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఆయా వార్డుల పరిధిలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ వార్డుకు కేటాయించిన రిటర్నింగ్‌ అధికారి వద్దే నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.

వార్డుల వారీగా నామినేషన్‌ కేంద్రాలు ఇవీ..:

1. 1, 2, 3 వార్డులు: కె.శ్రీధర్‌ – మహిళా సమాఖ్య భవనం, లాలాచెరువు.

2. 4, 5, 6 వార్డులు: డి.సుగుణ – వార్డు సచివాలయం 25, 26, మోరంపూడి రోడ్డు.

3. 7, 8, 9 వార్డులు: కె.అనసూయ – జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, బీ బ్లాక్‌, శాటిలైట్‌ సిటీ.

4. 10, 11, 12 వార్డులు: ఎం.లలితకుమారి – శ్రీమతి బొప్పన సావిత్రమ్మ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, హుకుంపేట.

5. 13, 14, 15 వార్డులు: డి.ముత్యం – వార్డు సచివాలయం భవనం, సుబ్బాయమ్మతోట, బొమ్మూరు-1.

6. 16, 17, 18 వార్డులు: డి.కుమారి – జిల్లా పరిషత్‌ బాలికల హైస్కూల్‌, ధవళేశ్వరం.

7. 19, 20, 21 వార్డులు: జి.అప్పలనరసింహం – గ్రామ సచివాలయ కార్యాలయం, ధవళేశ్వరం-1.

8. 22, 23, 24 వార్డులు: ఎస్‌.బి.గణేశ్వరరావు – గ్రామ సచివాలయం-3, బొమ్మూరు.

9. 25, 26, 27 వార్డులు: ఈ.నాగేశ్వరరావు – వార్డు సచివాలయం-47, రైల్వేస్టేషన్‌ ఎదురుగా, ఆల్కాట్‌ గార్డెన్స్‌.

10. 28, 29, 30 వార్డులు: ఎస్‌.లక్ష్మీదేవి – వార్డు సచివాలయం 35, 36, ఇన్నీసుపేట.

11. 31, 32, 33 వార్డులు: వై.మునేశ్వరరావు – శ్రీ గరిమెళ్ల సత్యనారాయణ ప్రభుత్వ ఉన్నత విద్యా శిక్షణ సంస్థ, మంగళవారపుపేట.

12. 34, 35, 36 వార్డులు: ఎస్‌.రమణ – వార్డు సచివాలయం-55, బెస్తవీధి.

13. 37, 38, 39 వార్డులు: జె.దయామణి – వార్డు సచివాలయం-57, బైపాస్‌ రోడ్డు, అన్నపూర్ణమ్మపేట.

14. 40, 41, 42 వార్డులు: టి.హనుమంతరావు – కమ్యూనిటీ హాల్‌, అంబేడ్కర్‌ నగర్‌.

15. 43, 44, 45 వార్డులు: కె.సుబ్బారావు – వార్డు సచివాలయం 14, 15 కార్యాలయం, దానవాయిపేట మెయిన్‌ రోడ్డు, ప్రకాష్‌నగర్‌.

16. 46, 47, 48 వార్డులు: కె.సుధాకరరావు – కమ్యూనిటీ హాల్‌, రాజేంద్రనగర్‌.

17. 49, 50, 51 వార్డులు: కె.క్రాంతిరేఖ – మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఉర్దూ స్కూల్‌, లక్ష్మీవారపుపేట మెయిన్‌ రోడ్డు.

18. 52, 53, 54 వార్డులు: పి.ఫణీంద్ర – వార్డు సచివాలయం-65, కొర్లంపేట.

19. 55, 56, 57 వార్డులు: వి.ఎల్‌.గంగరాజు – వార్డు సచివాలయం-68, మూలగొయ్య.

20. 58, 59, 60 వార్డులు: అహ్మద్‌ అజీజ్‌ – వార్డు సచివాలయం-72, గణేష్‌నగర్‌, జయకృష్ణాపురం.

21. 61, 62, 63 వార్డులు: షేక్‌ జబీనా – ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్‌) భవనం, కాతేరు.

22. 64, 65, 66 వార్డులు: బి.కిషోర్‌కుమార్‌ – వార్డు సచివాలయం-4, కాతేరు.

23. 67, 68, 69 వార్డులు: వి.శేఖర్‌ – వార్డు సచివాలయం-77, పీఅండ్‌టీ కాలనీ.

24. 70, 71, 72 వార్డులు: ఎం.సురేష్‌కుమార్‌ – వార్డు సచివాలయం-92, సుబ్బారావునగర్‌.

మేయర్‌ అభ్యర్థులకు నగరపాలక కార్యాలయంలో కేంద్రం:

మేయర్‌ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు నగరపాలక సంస్థ కార్యాలయం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వార్డు సభ్యుల అభ్యర్థులు, మేయర్‌ అభ్యర్థులు తమకు కేటాయించిన కేంద్రాల్లోనే నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.

గడువులోగా దాఖలు చేయాలి:

అభ్యర్థులు తమ వార్డుకు కేటాయించిన రిటర్నింగ్‌ అధికారి, నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వివరాలను ముందుగానే తెలుసుకోవాలని కమిషనర్‌ రాహుల్‌ మీనా సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నిర్ణీత తేదీలు, సమయాల్లో నామినేషన్లు సమర్పించాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.