రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన కుందన
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంద్రాక్షారామ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ లో ఇంటర్ ప్రధమ సంవత్సరం విద్యార్థిని కుందన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై పాఠశాలకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఇటీవల SGF ఆధ్వర్యంలో కాకినాడలో జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి అండర్-19 అథ్లెటిక్స్ పోటీలలో భాగంగా, లాంగ్ జంప్ విభాగంలో గుబ్బల లక్ష్మీ కుందన ప్రియ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు.ఈ నెల 14 నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలప్రధానోపాధ్యాయులు,పీజీటీలు, వ్యాయామ ఉపాధ్యాయులు, పాఠశాల విద్యా కమిటీ సభ్యులు కుందనను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థిని కృషిని, క్రీడా స్ఫూర్తిని ప్రశంసిస్తూ, రాబోయే రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా విజయం సాధించి పాఠశాలకు మరిన్ని కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.కుందన తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు