BREAKING
ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై మరింత ఉచ్చు మల్లన్నసాగర్ లీకేజీపై హరీశ్‌రావుకు కవిత సవాల్! అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమా..? సీఎం రేవంత్‌ రెడ్డికి సూటి ప్రశ్నలు కాకరకాయ తింటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందా.. మధుమేహ బాధితులకు నిపుణుల కీలక సూచనలు! వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన జిల్లా కార్యదర్శి అల్జీరియా వాణిజ్య నిబంధనలపై యూరోపియన్ కమిషన్‌ను ఆశ్రయించిన ఫ్రాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఆంత్రోపిక్‌పై ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసు టమాటాలు తింటే చర్మానికి కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.. సహజ సౌందర్యం కోసం నిపుణుల సూచనలు! అమెరికాలో ఉబెర్ డేటా బ్రీచ్ కలకలం ఆలమూరులో న్యాయవాదులు నిరసనలు - విధులు బహిష్కరణ చాలా రోజులకు ఓ మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ కలిగింది.. డియర్ ఆస్ట్రోనాట్ చిత్రంపై శేఖర్ కమ్ముల ప్రశంసల వర్షం! వాతావరణ లక్ష్యాలు వర్సెస్ ఆర్థిక డిమాండ్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత

శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మంటలు

Select Suryaa Now
శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మంటలు


 శ్రీకాళహస్తి సూర్య న్యూస్: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో అగ్నిప్రమాదం, ప్రసాదాల తయారీ కేంద్రంలో మంటలు, కాలి బూడిదైన వంట సామాగ్రితప్పిన ప్రాణ నష్టం, శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో  ప్రమాదం తప్పింది. ఆలయ ఆవరణలో ప్రసాదాలు తయారీ కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో మంటలు క్షణాల్లో ఉప్పెనలా వ్యాపించి, దట్టమైన పొగతో ఆలయ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. సుమారు గంటపాటు భక్తులు తీవ్ర ఆందోళనకు గురికాగా, దేవస్థానం, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై సంయుక్తంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.*కాలిపోయిన వంట సామాగ్రి*ఆలయ దక్షిణ గోపురం వద్ద వడలు, జిలేబి తయారీ కోసం ప్రత్యేకంగా రేకుల షెడ్డుతో కూడిన వంటశాల ఉంది. గురువారం ఉదయం ప్రమాదవశాత్తు ఆయిల్ లీకేజీ కావడంతో మంటలు వ్యాపించాయి. దీనికితోడు గ్యాస్ సిలిండర్ కూడా లీక్ కావడంతో మంటలు వంటశాల మొత్తం అలుముకున్నాయి. విద్యుత్ తీగలు కూడా కాలిపోయి వంటశాల పూర్తిగా దగ్ధమైంది. ఘటన స్థలంలో దట్టమైన పొగ రావడంతో ఏం జరుగుతుందో తెలియక భక్తులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా దక్షిణ గోపురం ద్వారా, అలాగే ప్రధాన ఆలయంలోకి భక్తులను వెళ్లకుండా సిబ్బంది నిలిపివేశారు. సుమారు గంటపాటు శ్రమించి అగ్నిమాపక, దేవస్థాన సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేశారు. వంట సామాగ్రి పూర్తిగా కాలిపోయినప్పటికీ, సిబ్బందికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం: ధర్మకర్తల మండలి అధ్యక్షులు, ఈవో మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కొట్టే సాయి ప్రసాద్, ఈవో వెంకటేశులు మీడియాతో మాట్లాడారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం సంభవించిందని స్పష్టం చేశారు. ఇందులో ఎవరి నిర్లక్ష్యం లేదని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, కేవలం వంట పాత్రలకు మాత్రమే నష్టం వాటిల్లిందని చెప్పారు. దేవస్థానం, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. సాయంత్రంలోపు తిరిగి ప్రసాదాల తయారీని ప్రారంభిస్తామని, భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు પુనరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. అనంతరం భక్తులను తిరిగి దర్శనానికి అనుమతించారు.

వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి