మృతుల కుటుంబాలను పరామర్శించిన కౌన్సిలర్ రాము
ఆమనగల్లు రంగారెడ్డి:
మండలంలోని ఆకుతోటపల్లి గ్రామానికిచెందిన బొప్పిడి అంజయ్య,మున్సిపాలిటీ పరిధిలోని విట్టాయిపల్లి గ్రామానికిచెందిన బుచ్చిరెడ్డి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆమనగల్లు మున్సిపల్ ఐదో వార్డ్ కౌన్సిలర్, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకుడు పాపిశెట్టి రాము మృతులకు నివాళులర్పించినఅనంతరం మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు తన వంతు ఆర్థిక సహాయం అందజేసి అండగా ఉంటానని భరోసానిచ్చారు. పరామర్శించిన వారిలో నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, రాకేష్, మృతుల కుటుంబ సభ్యులు, తదితరులు ఉన్నారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.