BREAKING
వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విగ్రహ ధ్వంసం హేయమైన చర్య : దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి : రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి డిమాండ్ వెయ్యి కోట్ల క్లబ్‌లో రామాయణం.. మేకింగ్ ఫొటోలతో రవి దూబే జోష్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన కుందన లీడిట్ పరిశ్రమ ప్రతినిధులతో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ కీలక చర్చలు భారత్ - శ్రీలంక మధ్య సాంకేతిక భాగస్వామ్యం రాజమహేంద్రవరం కు ఎన్నికల నేపాల్‌లో లోయలో పడిన ఎలక్ట్రిక్ వాహనం.. పద్నాలుగు మంది మృతి యూఏఈ తీరంలో ప్రక్షేపక దాడికి గురైన చమురు ట్యాంకర్ సైనిక వీరుల త్యాగాలకు సరికొత్త హంగులతో గాలంట్రీ అవార్డ్స్ పోర్టల్ ప్రారంభం శ్రీ మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి దంపతులు దేశవ్యాప్తంగా 'ఒక దేశం - ఒక రేషన్ కార్డు' పథకం భారతీయుడు 2 షూటింగ్ ప్రమాదంపై కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ రోజు త్రుటిలో ప్రాణాలు దక్కాయి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని కుందన రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స ప్రధానమంత్రి 'పీఎం రాహత్' పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి.. రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

రైతులు రీ సర్వేకు సహకరించాలి - చామనపల్లి ముంపు గ్రామ తరలింపు మూడు నెలల్లో పూర్తి చేయాలి

Select Suryaa Now
రైతులు రీ సర్వేకు సహకరించాలి  - చామనపల్లి ముంపు గ్రామ తరలింపు మూడు నెలల్లో పూర్తి చేయాలి

 

సూర్య – పెద్దపల్లి:

భూముల రీ సర్వేకు రైతులందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. సర్వే సమయంలో రైతులు అందుబాటులో ఉండి తమ భూముల హద్దులను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు.గురువారం ధర్మారం మండలం శాయంపేట, చామనపల్లి, జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామాల్లో జరుగుతున్న భూముల రీ సర్వే, చామనపల్లిలో సోషల్ ఎకనామిక్ సర్వేను కలెక్టర్ పరిశీలించారు. సర్వే వివరాలు పారదర్శకంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే అనంతరం అభ్యంతరాలకు అవకాశం కల్పిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.చామనపల్లి ముంపు గ్రామ తరలింపు ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జూలపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య, అల్పాహారం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ పర్యటనలో ధర్మారం తహసీల్దార్ శ్రీనివాస్, జూలపల్లి తహసీల్దార్ దత్తు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.