వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విగ్రహ ధ్వంసం హేయమైన చర్య : దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి : రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి డిమాండ్
మదనపల్లి రూరల్,మేజర్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రం,మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం,చింతకుంట గ్రామంలో కొలువైన శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని తొలగించి,ధ్వంసం చేసిన ఘటనను రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఇటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడిన దుండగులను పోలీసులు తక్షణమే గుర్తించి,వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.భారతీయ సంస్కృతి,సాంప్రదాయాలకు ఆలయాలు ప్రతీకలని,ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు.ఆలయాలకు తగిన భద్రత కల్పించి,భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి