BREAKING
వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి :

ధాన్యం కొనుగోలుపై సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమం

Select Suryaa Now
ధాన్యం కొనుగోలుపై సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమం

 

వంగర: నవంబర్ 12 మేజర్ న్యూస్
ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామ వ్యవసాయ సహాయకులు, టెక్నికల్ అసిస్టెంట్లు మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం గురువారంనిర్వహించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో గ్రామ వ్యవసాయ సహాయకులు, టెక్నికల్ అసిస్టెంట్లు మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లు నిర్వహించాల్సిన విధులు, బాధ్యతలను వివరించారు విజయనగరం జిల్లా పౌర సరఫరాల శాఖ నుంచి విచ్చేసిన టెక్నికల్ అసిస్టెంట్లు ధాన్యం కొనుగోలు యాప్ వినియోగం, రైతుల వివరాల నమోదు, ధాన్యం కొనుగోలు ప్రక్రియపై పూర్తిస్థాయిలో శిక్షణ అందించారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలను గూర్చి వారు వివరించారు.

ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి టి. కన్నబాబుమాట్లాడుతూ, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం సాధారణ రకం ధాన్యానికి క్వింటాకు రూ.2,441/-లు, గ్రేడ్-ఏ రకం ధాన్యానికి క్వింటాకు రూ.2,461/-లు చొప్పున రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు చెల్లించడం జరుగుతుందని ఆయన తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామారావు, పౌర సరఫరాల శాఖ సిబ్బంది, గ్రామ వ్యవసాయ సహాయకులు, పి ఏ సి ఎస్ సి ఈ ఓ పోలినాయుడు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.