BREAKING
వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విగ్రహ ధ్వంసం హేయమైన చర్య : దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి : రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి డిమాండ్ వెయ్యి కోట్ల క్లబ్‌లో రామాయణం.. మేకింగ్ ఫొటోలతో రవి దూబే జోష్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన కుందన లీడిట్ పరిశ్రమ ప్రతినిధులతో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ కీలక చర్చలు భారత్ - శ్రీలంక మధ్య సాంకేతిక భాగస్వామ్యం రాజమహేంద్రవరం కు ఎన్నికల నేపాల్‌లో లోయలో పడిన ఎలక్ట్రిక్ వాహనం.. పద్నాలుగు మంది మృతి యూఏఈ తీరంలో ప్రక్షేపక దాడికి గురైన చమురు ట్యాంకర్ సైనిక వీరుల త్యాగాలకు సరికొత్త హంగులతో గాలంట్రీ అవార్డ్స్ పోర్టల్ ప్రారంభం శ్రీ మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి దంపతులు దేశవ్యాప్తంగా 'ఒక దేశం - ఒక రేషన్ కార్డు' పథకం భారతీయుడు 2 షూటింగ్ ప్రమాదంపై కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ రోజు త్రుటిలో ప్రాణాలు దక్కాయి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని కుందన రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స ప్రధానమంత్రి 'పీఎం రాహత్' పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి.. రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : కలెక్టర్

Select Suryaa Now
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : కలెక్టర్

 

సూర్య – పెద్దపల్లి:

ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో అకడమిక్ ప్యానెల్ బృందాలతో పాఠశాలల విద్యా ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఓరల్ రీడింగ్ ఫ్లూఎన్సీ అభివృద్ధికి నిర్వహిస్తున్న రెమెడియేషన్ తరగతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటల్ బోర్డులు, బోధనా అభ్యసన సామగ్రిని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి అదనపు శిక్షణ అందించాలని, ప్రధానోపాధ్యాయులు తరగతులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యార్థుల్లో చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలు పెంపొందించేలా బోధన సాగాలని సూచించారు. సమావేశంలో డీఈవో జి.శారద, ఏఎంఓ డా.పి.ఎం. షేక్, అకడమిక్ ప్యానెల్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.