BREAKING
వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విగ్రహ ధ్వంసం హేయమైన చర్య : దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి : రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి డిమాండ్ వెయ్యి కోట్ల క్లబ్‌లో రామాయణం.. మేకింగ్ ఫొటోలతో రవి దూబే జోష్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన కుందన లీడిట్ పరిశ్రమ ప్రతినిధులతో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ కీలక చర్చలు భారత్ - శ్రీలంక మధ్య సాంకేతిక భాగస్వామ్యం రాజమహేంద్రవరం కు ఎన్నికల నేపాల్‌లో లోయలో పడిన ఎలక్ట్రిక్ వాహనం.. పద్నాలుగు మంది మృతి యూఏఈ తీరంలో ప్రక్షేపక దాడికి గురైన చమురు ట్యాంకర్ సైనిక వీరుల త్యాగాలకు సరికొత్త హంగులతో గాలంట్రీ అవార్డ్స్ పోర్టల్ ప్రారంభం శ్రీ మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి దంపతులు దేశవ్యాప్తంగా 'ఒక దేశం - ఒక రేషన్ కార్డు' పథకం భారతీయుడు 2 షూటింగ్ ప్రమాదంపై కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ రోజు త్రుటిలో ప్రాణాలు దక్కాయి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని కుందన రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స ప్రధానమంత్రి 'పీఎం రాహత్' పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి.. రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదల సాధ్యం కాదు : కలెక్టర్

Select Suryaa Now
యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి  ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదల సాధ్యం కాదు : కలెక్టర్

 

సూర్య – పెద్దపల్లి

జిల్లాలో తక్కువ వర్షపాతం, ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిన నేపథ్యంలో యాసంగిలో రైతులు వరి సాగు చేయవద్దని, ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. గురువారం సమీకృత కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో యాసంగి సాగుపై సమీక్ష నిర్వహించారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం ఉన్న నీరు తాగునీటి అవసరాలకే సరిపోతుందని, యాసంగికి సాగునీరు విడుదల చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. వరి సాగు చేస్తే నీటి, విద్యుత్ కొరతతో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఒక ఎకరం వరికి వినియోగించే నీటితో నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయవచ్చని తెలిపారు. రైతులు మొక్కజొన్నతో పాటు ఇతర ఆరుతడి పంటలను సాగు చేసేలా రైతు వేదికల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, ఉద్యానవన శాఖ అధికారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.