పంచాయతీ ఎన్నికల అధికారులకు శిక్షణ
కె గంగవరం,మేజర్ న్యూస్ :మండలంలోని 26 గ్రామపంచాయతీల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇందులో భాగంగా తొమ్మిది నామినేషన్ కేంద్రాలను ఎంపిక చేసి,పది మంది స్టేజ్-1 అధికారులను నియమించారు.వీరికి కే.గంగవరం ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈవోపీఆర్డీ,డిప్యూటీ ఎంపీడీవో యాళ్ల భవానీశంకరుడు,మాస్టర్ ట్రైనర్ జీవీఎస్ సుబ్రహ్మణ్యం నామినేషన్ల స్వీకరణ విధివిధానాలు,ఎన్నికల నిబంధనలపై అధికారులకు అవగాహన కల్పించారు.పామర్రు పంచాయతీ కేంద్రంగా ఎండగండి,పామర్రు,కూళ్ల పంచాయతీల నామినేషన్లను ఎన్.శ్రీనివాస్ స్వీకరిస్తారు.అంజూరు కేంద్రంలో సత్యవాడ,పాణింగపల్లి,అంజూరు పంచాయతీల నామినేషన్లను కె.శ్రీను,సుందరపల్లి కేంద్రంలో తామరపల్లి,ఊడిమూడి,సుందరపల్లి పంచాయతీల నామినేషన్లను తేతలి శ్రీనివాసరెడ్డి స్వీకరిస్తారు.కె.గంగవరం కేంద్రంలో కోటిపల్లి,కోట,కె.గంగవరం పంచాయతీల నామినేషన్లను ఎన్.వెంకటరమణ,మసకపల్లి కేంద్రంలో శేరిలంక,బ్రహ్మపురి,మసకపల్లి పంచాయతీల నామినేషన్లను వి.శ్రీనివాసరావు స్వీకరిస్తారు.శివల కేంద్రంలో అద్దంపల్లి,ఎర్రపోతవరం,శివల పంచాయతీల నామినేషన్లను ఎస్.హెచ్.కుమారి,పేకేరు కేంద్రంలో పేకేరు,తాళ్లపాడు,బట్టలపాలిక పంచాయతీల నామినేషన్లను బొచ్చ నాగరాజు స్వీకరిస్తారు.దంగేరు కేంద్రంలో కుడుపూరు,దంగేరు,కుందూరు పంచాయతీల నామినేషన్లను ఎండీ.సాహిద్,బాలాంతరం కేంద్రంలో గుడిగళ్ల,బాలాంతరం పంచాయతీల నామినేషన్లను టి.శ్రీరామ్మూర్తి స్వీకరించనున్నారు.రామచంద్రపురం సీడీపీవో వి.వి.వరహాలక్ష్మిని రిజర్వ్‌డ్ స్టేజ్-1 అధికారిగా నియమించి శిక్షణ ఇచ్చారు.నోటిఫికేషన్ జారీ నుంచి ఎన్నికల ఫలితాల అనంతరం గెలుపు ధ్రువీకరణ పత్రాలు అందజేసే వరకు స్టేజ్-1 అధికారులు విధుల్లో కొనసాగనున్నారు.