BREAKING
కరువు రైతులకు రుణ ఉపశమనం కల్పించాలి! బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి..జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ సూచనలు ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి శాంతిభద్రతలకే కార్డెన్ సెర్చ్. శాంతిభద్రతలకే కార్డెన్ సెర్చ్. నర్సరీ రైతు మార్గాని సత్యనారాయణకు యూనియన్ బ్యాంక్ పురస్కారం వారణాసి సినిమా ఓటీటీ రైట్స్ సంచలనం.. రూ.500 కోట్ల రికార్డు బిజినెస్‌పై టాలీవుడ్‌లో జోరుగా చర్చ! ఖైదీల సమస్యలు తెలుసుకున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఎవరు..? ఆశావాహుల పేర్లు శాంతాడంత.... ఎమ్మెల్యే ఎవరికి ఓకే అంటే వారే అభ్యర్థి... పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలి పత్తి సాగుపై రైతులకు అవగాహన భూ రీ సర్వే పనులు వేగవంతంగా పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి గురుకుల విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులు యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదల సాధ్యం కాదు : కలెక్టర్ పంచాయతీ ఎన్నికల అధికారులకు శిక్షణ

దోమతెరలతో వ్యాధులు దూరం - డాక్టర్ బేతం హర్ష

Select Suryaa Now
దోమతెరలతో వ్యాధులు దూరం - డాక్టర్ బేతం హర్ష

ఆత్మకూర్, మేజర్ న్యూస్ : దోమతెరలను వాడడం వలన దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను తరిమికొట్టవచ్చని బైర్లూటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు  బేతం హర్ష అన్నారు. గురువారం మండలంలోని బైర్లూటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వెంకటాపురం గ్రామం వసతి గృహం లోని విద్యార్థులకు డాక్టర్ బేతం హర్ష ఆధ్వర్యంలో దోమతెరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బేతం హర్ష  మాట్లాడుతూ దోమల ద్వారా వ్యాపించే వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా తదితర వ్యాధుల గురించి విద్యార్థులకు వివరించామన్నారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు దరిచేరకూడదు అంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా దోమతెరలు వాడాలని, దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. పరిసర ప్రాంతాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకోవడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమల వృద్ధి చెందామని తద్వారా వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు అన్నారు. అనంతరం విద్యార్థులకు ఆత్మకూరు సబ్ యూనిట్ అధికారి కృష్ణారెడ్డి విద్యార్థులకు దోమతెరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిహెచ్ఓ కుద్దుస్ బాష, ఆరోగ్య కార్యకర్తలు భాస్కర్, పద్మ,  వసతి గృహం వార్డెన్ రాజు, ఆశా కార్యకర్తలు,విద్యార్థులుపాల్గొన్నారు.