BREAKING
మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ నైజాం రైట్స్ సంచలనం.. రూ.35 కోట్ల భారీ డీల్‌ను దక్కించుకున్న ఏషియన్ సినిమాస్! కరువు రైతులకు రుణ ఉపశమనం కల్పించాలి! బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి..జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ సూచనలు ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి శాంతిభద్రతలకే కార్డెన్ సెర్చ్. శాంతిభద్రతలకే కార్డెన్ సెర్చ్. నర్సరీ రైతు మార్గాని సత్యనారాయణకు యూనియన్ బ్యాంక్ పురస్కారం వారణాసి సినిమా ఓటీటీ రైట్స్ సంచలనం.. రూ.500 కోట్ల రికార్డు బిజినెస్‌పై టాలీవుడ్‌లో జోరుగా చర్చ! ఖైదీల సమస్యలు తెలుసుకున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఎవరు..? ఆశావాహుల పేర్లు శాంతాడంత.... ఎమ్మెల్యే ఎవరికి ఓకే అంటే వారే అభ్యర్థి... పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలి పత్తి సాగుపై రైతులకు అవగాహన భూ రీ సర్వే పనులు వేగవంతంగా పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి గురుకుల విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులు యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదల సాధ్యం కాదు : కలెక్టర్

59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు -రాష్ట్రంలోనే నెంబర్-1 గా నిర్వహించాలి: చైర్మన్ డా.రెడ్డివారి గురువారెడ్డి

Select Suryaa Now
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు -రాష్ట్రంలోనే నెంబర్-1 గా నిర్వహించాలి: చైర్మన్ డా.రెడ్డివారి గురువారెడ్డి

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచేలా ఘనంగా నిర్వహించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. రెడ్డివారి గురువారెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు.తిరుపతి ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో గురువారం జిల్లా గ్రంథాలయ అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యా, ఐటీ, గ్రంథాలయాల శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు వారోత్సవాలను 6 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల్లో పుస్తక పఠనా సంస్కృతిని పెంపొందిస్తూ గ్రంథాలయాల ప్రాధాన్యతపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని అన్ని బుక్ డిపాజిట్ సెంటర్ల నిర్వాహకులను భాగస్వాములను చేసి, ఎక్కువ మంది పాఠకులను గ్రంథాలయాలకు వచ్చేలా కృషి చేయాలని తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ వంటి వివిధ పోటీలు నిర్వహించి వారిని ప్రోత్సహించాలన్నారు. గ్రంథాలయ వారోత్సవాలకు జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవో, ఎంఈఓ, ఆర్డీవో లను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించాలన్నారు. 

వారోత్సవాల ప్రధాన ఘట్టాలు.…

జిల్లా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం, చాచా నెహ్రూ జయంతితో పాటు వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే నవంబర్ 19వ తేదీ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మహిళా దినోత్సవం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. నవంబర్ 20వ తేదీ అక్షరాస్యతా దినోత్సవం, జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని చైర్మన్  ఆదేశించారు. పై కార్యక్రమాలన్నీ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఉన్నతాధికారుల ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి ఆర్విఆర్ఎస్ఎస్ శర్మ, స్థానిక గ్రంథాలయ అధికారి ఎం.ధనంజయులు, జిల్లాలోని గ్రంథాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్