అరాచకంతో అభివృద్ధితోనే టిడిపి అత్యధిక స్థానాలు గెలిచాం
కుందుర్పి) కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జడ్పిటిసి లతోపాటు అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులు జడ్పీటీసీ, ఎంపీటీసీలు గెలుపొందడానికి ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ప్రధాన కారణమని,అరాచకాలు కాదని కుందుర్పి మండల కూటమి నాయకులు, నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ,ఎంపీటీసీలు పేర్కొన్నారు.మండల కేంద్రంలో టిడిపి మండల కన్వీనర్ ధనంజయ అధ్యక్షతన గురువారం విలేకరులసమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా నూతనంగా ఎన్నికైన జడ్పిటిసి ప్రభావతి మరియు పలువురు ఎంపీటీసీలు మాట్లాడుతూ స్థానికంగా జరిగిన జడ్పీటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ హాలో తెలుగుదేశంపార్టీ నాయకులు అరాచకాలు సృష్టించి గెలుపొందారని వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడుప్రచారాన్ని వారు తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలవడంతో నిజాన్ని జీర్ణించుకోలేని వైకాపా నేతలు వారికార్యకర్తల నుండి సానుభూతి పొందడానికి కౌంటింగ్ సమయంలో టిడిపి నాయకుల అరాచకాలు సృష్టించి ఎంపీటీసీ జడ్పిటిసి స్థానాలు గెలుపొందారని అసత్య ప్రచారాలు చేయడం తక్షణం మానుకోవాలని కూటమినేతలు వైకాపా నాయకులను హెచ్చరించారు.ఎన్నికల్లో నిజంగా తాము అరాచకాలు సృష్టించాలనుకుంటే ఎన్నికల నామినేషన్ రోజే సృష్టించే వాళ్ళమని, అడ్డదారులలో అధికారాన్ని సంపాదించుకోవడం తమ నాయకులకు ఇష్టంలేక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారన్నారు. వచ్చే, సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలతో సానుభూతిఓట్లు కోసం వైసీపీ నేతలు తప్పుడు ప్రచారంచేస్తున్నారని దుయ్యబట్టారు.టీడీపీ అరాచకాలు పేరుతో వైసిపి నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను తక్షణమే ఆపాలన్నారు. , కళ్యాణదుర్గం శాసన సభ్యులుగా అమిలినేని సురేంద్రబాబు వచ్చాక సమస్య తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించిన అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే అన్నారు.ప్రజల దాహార్తిని తీర్చే తాగునీటి బోర్లనుండి,నూతనరోడ్లు ఏర్పాటు,సైకిల్ పంపిణీ అనేక దేవాలయాల అభివృద్ధికి విరాళాలు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు, నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ లాంటి అనేక సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు,చాపిరి చెరువుకు నీళ్లు తీసుకొరావడం లాంటి కార్యక్రమాలు చేపట్టడం తోనే ప్రజలు తమపార్టీ అభ్యర్థులకు ప్రజలు ఓట్లేసి అత్యధిక స్థానాల్లో గెలిపించారన్నారు. కార్యకర్తలుకు టికెట్లుగాని, అంగన్వాడీ ఉద్యోగాలు కానీ అమ్ముకోవడం వైసిపికె సాధ్యంఅన్నారు.గత వైసిపి ప్రభుత్వంలో అప్పటి కుందుర్పి ఎస్సై గణేష్ ప్రోత్బలంతో సర్పంచ్ ఎన్నికలు గెలుచుకోవడం గాని,అంగన్వాడీ ఉద్యోగిని కావాలని జైలుకు పంపించడం లాంటి అరాచకాలు చేసింది వైకాపా అన్నారు. కుల,మత రాజకీయాల సంబంధం లేకుండా అభివృద్ధి దేంగా పనిచేస్తూ అభివృద్ధి ప్రదాతగా పేరుపొందిన సురేందర్ బాబు మరియు టీడీపీపైన అసత్య ప్రచారాలుచేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న వైసీపీ నాయకులు ఇలాంటి వాటికి పుల్ స్టాప్ పెట్టాలని హితవుపలికారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గంగాధర, జడ్పిటిసి ప్రభావతి,సింగల్ విండో అధ్యక్షులు చిత్రలింగ, గోవిందు,సీనియర్ నాయకులు రాఘవేంద్ర బాబు, మల్లికార్జున, వేట్టి హనుమంతరాయుడు,ఓబులపతి, ఎంపీటీసీలు బాగేపల్లి రామాంజనేయులు, నాగరాజు,సజ్జల వెంకటేష్, అంజనమ్మ,మంజుల,సుజాతమ్మ, ఓబులమ్మ,సిద్దేశ్వరి సుమియభాను, వినోదమ్మ, రూప,బాబు అనేకమంది టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. టి రాజు రిపోర్టర్