BREAKING
పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కూటమి విజయంతో రాష్ట్రానికి ఆదర్శం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ధ్యానంతో మానసిక ప్రశాంతత.. అహింసా జగత్‌ పిరమిడ్‌ ధ్యాన ఆశ్రమం ప్రారంభం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మంటలు ఆర్బీఐ రెడ్ లైన్ దాటిన రిటైల్ ద్రవ్యోల్బణం: అక్టోబర్‌లో రెండేళ్ల గరిష్టం 6.09% నమోదు చీరాలలో టీడీపీలోకి 50 కుటుంబాల చేరిక సామాన్యుడికి ద్రవ్యోల్బణం సెగ: పాలు, నెయ్యి, సబ్బులు, సిగరెట్ల ధరల పెరుగుదల భారత పీఎల్ఐ (PLI) పథకాల రిపోర్ట్ కార్డ్: అంచనాలను అందుకున్న రంగాలు, వెనుకబడిన రంగాల పూర్తి వివరాలు 48వ డివిజన్‌లో విద్యుత్ అంతరాయం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇచ్చిన ఆ సలహానే నాకు శ్రీరామరక్ష.. యంగ్ పేసర్ ఆకిబ్ నబీ కీలక వ్యాఖ్యలు! 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు -రాష్ట్రంలోనే నెంబర్-1 గా నిర్వహించాలి: చైర్మన్ డా.రెడ్డివారి గురువారెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించిన కౌన్సిలర్ రాము దోమతెరలతో వ్యాధులు దూరం - డాక్టర్ బేతం హర్ష జాతీయ స్థాయి పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన సంచలన పేసర్‌కు పిలుపు.. భారత్‌తో ఆఖరి రెండు వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన!

విద్యార్థులకు ఆధ్యాత్మిక భావన అవసరం

Select Suryaa Now
విద్యార్థులకు ఆధ్యాత్మిక భావన అవసరం

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: విద్యార్థులకు ఆధ్యాత్మిక భావన అవసరమని ప్రముఖ ఆధ్యాత్మిక వక్త శ్రీ గురూజీ రాధా మనోహర్ దాస్ తెలిపారు. గురువారం నగరం లోని స్థానిక విజయం విద్యా సంస్థ ఆధ్వర్యంలో గరుడ ఆడిటోరియంలో ప్రముఖ ఆధ్యాత్మిక వక్త శ్రీ గురూజీ రాధా మనోహర్ దాస్ స్ఫూర్తిదాయక ఉపన్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గురూజీ మాట్లాడుతూ విద్య అనేది కేవలం పుస్తక జ్ఞానానికి, ఉద్యోగ అవకాశాలకు మాత్రమే పరిమితం కాకూడదని, విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావన, నైతిక విలువలు, క్రమశిక్షణ, మానవత్వం సానుకూల ఆలోచనా విధానం పెంపొందించే విధంగా ఉండాలని వివరించారు.విద్యార్థులు తమ జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడంతో పాటు, ఆ లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతర కృషి, ఆత్మవిశ్వాసం, పట్టుదల, సమయపాలన ఎంతో అవసరమని సూచించారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, మంచి ఆలోచనలు మరియు ఉన్నతమైన వ్యక్తిత్వంతో సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.ఆధునిక విద్యతో పాటు ఆధ్యాత్మిక చింతన, మానసిక ప్రశాంతత, సంస్కారవంతమైన జీవన విధానం కలిసినప్పుడే విద్యార్థులు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని సాధించగలరని ఆయన తెలియజేశారు.గురూజీ ప్రసంగం విద్యార్థుల్లో నూతన ఆలోచనలను రేకెత్తించడమే కాకుండా, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే సంకల్పాన్ని, నూతన ఉత్సాహాన్ని నింపింది. విద్యార్థులకు తమ భవిష్యత్తు పట్ల స్పష్టమైన అవగాహన కల్పిస్తూ, సరైన దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో విజయం విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎం. తేజోమూర్తి, విజయం విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ శైలజ మూర్తి, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోపి, బిజినెస్ స్కూల్ ప్రిన్సిపల్ 

జయం, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజగోపాల్, కంప్యూటర్ విభాగం సీనియర్ ఫ్యాకల్టీ శ్రీనివాసన్, ఇన్‌చార్జ్ ఎస్. మోహన్ నాయుడు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

 

 

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.