BREAKING
పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కూటమి విజయంతో రాష్ట్రానికి ఆదర్శం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ధ్యానంతో మానసిక ప్రశాంతత.. అహింసా జగత్‌ పిరమిడ్‌ ధ్యాన ఆశ్రమం ప్రారంభం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మంటలు ఆర్బీఐ రెడ్ లైన్ దాటిన రిటైల్ ద్రవ్యోల్బణం: అక్టోబర్‌లో రెండేళ్ల గరిష్టం 6.09% నమోదు చీరాలలో టీడీపీలోకి 50 కుటుంబాల చేరిక సామాన్యుడికి ద్రవ్యోల్బణం సెగ: పాలు, నెయ్యి, సబ్బులు, సిగరెట్ల ధరల పెరుగుదల భారత పీఎల్ఐ (PLI) పథకాల రిపోర్ట్ కార్డ్: అంచనాలను అందుకున్న రంగాలు, వెనుకబడిన రంగాల పూర్తి వివరాలు 48వ డివిజన్‌లో విద్యుత్ అంతరాయం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇచ్చిన ఆ సలహానే నాకు శ్రీరామరక్ష.. యంగ్ పేసర్ ఆకిబ్ నబీ కీలక వ్యాఖ్యలు! 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు -రాష్ట్రంలోనే నెంబర్-1 గా నిర్వహించాలి: చైర్మన్ డా.రెడ్డివారి గురువారెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించిన కౌన్సిలర్ రాము దోమతెరలతో వ్యాధులు దూరం - డాక్టర్ బేతం హర్ష జాతీయ స్థాయి పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన సంచలన పేసర్‌కు పిలుపు.. భారత్‌తో ఆఖరి రెండు వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన!

సంక్షేమ వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ

Select Suryaa Now
సంక్షేమ వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ


విజయనగరం మేజర్ న్యూస్: విజయనగరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ  కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్  ఎ. కృష్ణ ప్రసాద్  విజయనగరం పట్టణంలోని ఉన్న ప్రీ-మెట్రిక్ సోషల్ వెల్ఫేర్ బాలుర వసతి గృహం, పోస్ట్ మెట్రిక్ ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ బాలుర వసతి గృహం-2 మరియు పోస్ట్ మెట్రిక్ ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం-2లను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వసతి గృహాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, భోజన వసతి, వంటగది, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడి వసతి గృహాల్లో ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా, భోజనం నాణ్యత ఎలా ఉంది, తాగునీరు , ఇతర సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమ సమస్యలను స్వేచ్ఛగా తెలియజేయాలని, వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థులకు మెరుగైన వసతి, ఆరోగ్యకరమైన వాతావరణం, నాణ్యమైన ఆహారం మరియు విద్యాభ్యాసానికి అనుకూలమైన సౌకర్యాలు కల్పించడం సంబంధిత అధికారుల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.