13వ తేదీన జిల్లాలో పర్యటించాలి : బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
బాపట్ల, మేజర్‌న్యూస్ :
తుపాను నష్టం అంచనాలను పరిశీలించడానికి కేంద్రం నుంచి అధికారుల బృందం జిల్లాకు వస్తుందని కలెక్టర్ చెప్పారు. తుపానుతో దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యానవన పంటలు, ఆర్డబ్ల్యూఎస్ తాగునీటి పథకాలు, ఆర్ అండ్ బి రహదారులు, పంట కాల్వలు, దెబ్బతిన్న నివాస గృహాలు, విద్యుత్ సబ్ స్టేషన్, నేలకొరిగిన స్తంభాలు, పునరావాస కేంద్రాల్లో సహాయక చర్యలు, దెబ్బతిన్న మత్స్యకారుల బోట్లు ఫోటో ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేయాలన్నారు. తదుపరి అధికారులతో సమావేశం ఉంటుందన్నారు. బాపట్ల మండలం జమ్ములపాలెం గ్రామంలో దెబ్బతిన్న పొలాలు, చీరాలలో మత్స్యకారుల బోట్లు, కడవకుదురులో ఉద్యాన వన పంటలు, కారంచేడు మండలం కుంకులమర్రులో గండ్లు పడిన పంట కాల్వలు, పర్చూరులో దెబ్బతిన్న పర్చూరు వాగు, అదే గ్రామంలో దెబ్బతిన్న నివాస గృహాలు, ఉప్పుటూరులో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రహదారులు, ఆర్ అండ్ రహదారులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారన్నారు. ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వే ఆధారంగా జీవో నెంబర్ ఒకటిని అనుసరించి నష్టం అంచనాలను సిద్ధం చేయాలని సిపిఓను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో స్పష్టంగా సేకరించిన సమాచారాన్ని నివేదికలో పొందు పర్చాలన్నారు. ఆయా శాఖల అధికారులకు నిర్దేశించిన బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి లవన్న, సీపీఓ షాలేమురాజు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.