చంద్రబాబు ఆలోచన మరో పారిశ్రామిక విప్లవానికి నాంది పలకనుంది : Dr. గొట్టిపాటి లక్ష్మీ
ఒంగోలు, మేజర్‌న్యూస్ :
'పెట్టుబడుల భద్రతకు ప్రత్యేక చట్టం' ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, అనుభవాల నుంచి పుట్టిన మరో వినూత్న ఆలోచన. ఆయనలోని అభివృద్ధి కాంక్ష, ప్రగతిశీల భావజాలానికి ప్రత్యక్ష నిదర్శనం. విశాఖ భాగస్వామ్య సదస్సు (సీఐఐ సమ్మిట్) వేదిక సాక్షిగా ముఖ్యమంత్రి మరో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికారు. ఆయన ఆలోచన కార్యరూపం దాలిస్తే, ప్రపంచమే అబ్బురపడేలా
భారత పారిశ్రామిక ప్రగతి, మరే దేశానికీ సాధ్యం కాని విధంగా దూసుకెళ్తుంది. కేంద్రం ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని అమల్లోకి తేవాలి. ఈ చట్టం వల్ల దేశ ఆర్థిక, పారిశ్రామిక, ఉపాధి రంగాలు జెట్ స్పీడ్ తో పురోగమిస్తాయి. ప్రభుత్వాలు మారినా, ఒప్పందాలు, ప్రోత్సాహకాలు, అనుమతులు యథావిథిగా కొనసాగుతాయి. దాంతో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు నిజమైన భద్రత, భరోసా లభిస్తాయి. దాంతో వారు తమ ఆలోచనలు, పెట్టుబడుల విస్తరణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల విస్తరణతో పారిశ్రామిక వృద్ధి పెరిగి, స్థానిక వ్యాపారాలు ఊపందుకొని, యువతకు విరివిగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి పెట్టుబడిదారుల్లో నమ్మకం, వారి పెట్టుబడులకు సరైన భద్రత కల్పించడమనేది పాలకులు, ప్రభుత్వాల కనీస బాధ్యతగా మారాలి. తమ పెట్టుబడులు, వ్యాపారాలు, సంస్థలకు రక్షణ లేనందునే 2019-24 మధ్య ఏపీలో పారిశ్రామిక వేత్తలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాంతో ఆనాడు రాష్ట్రం లక్షల కోట్ల ఆదాయాన్ని, వేలాది ఉపాధి అవకాశాల్ని కోల్పోయి, పొరుగు రాష్ట్రాల చేతిలో అవహేళనలు, అవమానాలు ఎదుర్కొంది. భరోసా స్థానంలో భయాన్ని పెంచిన జగన్ ఏకపక్ష నిర్ణయాలు, రాష్ట్ర ఆర్థికరంగాన్ని, ప్రజల జీవన ప్రమాణాల్ని, యువత ఉపాధిని దిగజార్చాయి. గత పాలకుల విధ్వంసం, విధానపరమైన అస్థిరత రాష్ట్రానికి చేసిన నష్టం ఎప్పటికీ పూడ్చలేనిది. ఆనాటి నష్టంతో రాష్ట్రంలో ఉపాధి కరవై,, ఉద్యోగాలు దొరక్క యువత తీవ్ర మానసిక వేదన అనుభవించి, బలవన్మరణాలకు పాల్పడ్డారు. పెట్టుబడుల్ని తరిమేసి, రాష్ట్రాన్ని తిరోగమన బాట పట్టించిన వైసీపీ ప్రభుత్వ, అవినీతి పాలకుల అంధకార పాలన ఏపీని 30 ఏళ్లు వెనక్కు నెట్టింది. 2014-19లో టీడీపీ ప్రభుత్వం చేసిన పలు అభివృద్ధి ఒప్పందాల్ని పున:సమీక్షల పేరుతో రద్దు చేసిన జగన్ ప్రభుత్వం రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ప్రభుత్వాలు, పాలకులు మారినప్పుడల్లా పాలసీలు, నిర్ణయాలు మారడమనే అనాలోచిత, విధానం దేశ పారిశ్రామిక ప్రగతికి, ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టు లాంటిదే.” అని దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గురువారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు.