BREAKING
*మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు* *మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు* ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి కటారు చిన్న రాజా యాదవ్ మద్దతు పంచాయతీ ఎన్నికల విధులు అదే మండలం లేదా పక్క మండలంలో కేటాయించాలి.. ఎస్‌టీయూ వినతి క్రిస్మస్ కానుకగా ‘రియాలిటీ’ విడుదల.. ‘రుత్తూ’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, డైరెక్టర్ కిరణ్ అబ్బవరం! చంద్రబాబు ఆలోచన మరో పారిశ్రామిక విప్లవానికి నాంది పలకనుంది : Dr. గొట్టిపాటి లక్ష్మీ విద్యార్థులకు ఆధ్యాత్మిక భావన అవసరం రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు కెల్ల విద్యార్థులు _జూలకల్లు పాఠశాలలను తనిఖీ చేసిన మండల విద్యాశాఖ అధికారి ఖాసీం_ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఎండీ ఖాసీం మండలంలోని జూలకల్లు గ్రామంలో గల మండల ప్రాథమిక పాఠశాల (ఉర్దూ) మరియు మండల ప్రాథమిక పాఠశాల (ప్రధాన) లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులతో సమావేశం చంద్రయాన్ విలక్షణమైన కాన్సెప్ట్‌తో అందరినీ అలరిస్తుంది.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో శ్రీవిష్ణు! 13వ తేదీన జిల్లాలో పర్యటించాలి : బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి అరాచకంతో అభివృద్ధితోనే టిడిపి అత్యధిక స్థానాలు గెలిచాం పదోన్నతి పొందిన విజయ్ కుమార్ అభినందనలు తెలిపిన వున్నం అంజనేయులు పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పల్నాడు జిల్లా నరసరావుపేట సిపిడిసిఎల్ ఎస్ఈ గా విధులు నిర్వహించి, పదోన్నతిపై ముఖ్య ఇంజనీరు (సీఈ)గా విజయవాడ సిపిడిసిఎల్ కు వెళ్లిన విజయ్ కుమార్ గారిని విజయవాడలోని సిపిడిసిఎల్ కార్యాలయంలో పిడుగురాళ్ల పుర ఇడుపు కాయితం మంచి ఫ్యామిలీ డ్రామా ఫిలిం.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత బన్నీ వాస్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఇంధన రంగంపై నిర్వహించిన ప్రత్యేక ప్లీనరీ సెషన్ లో మంత్రి నారా లోకేష్

చిన్నారుల్లో న్యుమోనియా నిర్మూలనకు ప్రచారం - నవంబర్ 12 నుంచి ఫిబ్రవరి 28 వరకు

Select Suryaa Now
చిన్నారుల్లో న్యుమోనియా నిర్మూలనకు ప్రచారం - నవంబర్ 12 నుంచి ఫిబ్రవరి 28 వరకు

చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:చిన్నపిల్లల్లో న్యుమోనియా వ్యాధి భారాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన న్యుమోనియా వ్యతిరేక ప్రచార కార్యక్రమం 2026 నవంబర్ 12వ తేదీ నుండి 2027 ఫిబ్రవరి 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం తెలిపింది. ప్రపంచ న్యుమోనియా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చిన్నపిల్లల్లో న్యుమోనియా వ్యాధి నివారణ, రక్షణ మరియు చికిత్సపై ప్రజల్లో అవగాహన కల్పించడం, వ్యాధి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించడం, తల్లిదండ్రులు మరియు సంరక్షకులలో సకాలంలో వైద్య సేవలు పొందే అలవాటును పెంపొందించడం మరియు న్యుమోనియా నివారణ టీకా ప్రాముఖ్యతను తెలియజేయడం.
ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని వార్డు, గ్రామ సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాలలో ప్రచార సామగ్రిని ప్రదర్శించాలి. చిన్నపిల్లల్లో న్యుమోనియా వ్యాధి లక్షణాలు, సంకేతాలు మరియు ప్రమాద సూచనలపై తల్లులు మరియు ప్రజలకు అవగాహన కల్పించాలి. అర్హత కలిగిన పిల్లలకు నిర్ణీత వయస్సు ప్రకారం, తగిన మోతాదులో న్యుమోనియా నివారణ టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలి. న్యుమోనియా అనుమానిత కేసులను గుర్తించి, నిర్దేశించిన చికిత్సా మార్గదర్శకాల ప్రకారం తగిన వైద్య చికిత్స అందేలా చూడాలి. అన్ని ఉప ఆరోగ్య కేంద్రాలు, గ్రామ మరియు వార్డు సచివాలయాల పరిధిలో జెంటామైసిన్ ఇంజక్షన్ మరియు అమోక్సిసిలిన్ సిరప్ మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. సంబంధిత అధికారులు మరియు వైద్య ఆరోగ్య సిబ్బంది ఈ సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ న్యుమోనియా వ్యతిరేక ప్రచార కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కోరారు.

చిత్తూరు అర్బన్ రిపోర్టర్,   లవకుమార్