BREAKING
కూరగాయల సాగుతో అదనపు ఆదాయం ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కూటమి విజయంతో రాష్ట్రానికి ఆదర్శం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ధ్యానంతో మానసిక ప్రశాంతత.. అహింసా జగత్‌ పిరమిడ్‌ ధ్యాన ఆశ్రమం ప్రారంభం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మంటలు ఆర్బీఐ రెడ్ లైన్ దాటిన రిటైల్ ద్రవ్యోల్బణం: అక్టోబర్‌లో రెండేళ్ల గరిష్టం 6.09% నమోదు చీరాలలో టీడీపీలోకి 50 కుటుంబాల చేరిక సామాన్యుడికి ద్రవ్యోల్బణం సెగ: పాలు, నెయ్యి, సబ్బులు, సిగరెట్ల ధరల పెరుగుదల భారత పీఎల్ఐ (PLI) పథకాల రిపోర్ట్ కార్డ్: అంచనాలను అందుకున్న రంగాలు, వెనుకబడిన రంగాల పూర్తి వివరాలు 48వ డివిజన్‌లో విద్యుత్ అంతరాయం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇచ్చిన ఆ సలహానే నాకు శ్రీరామరక్ష.. యంగ్ పేసర్ ఆకిబ్ నబీ కీలక వ్యాఖ్యలు! 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు -రాష్ట్రంలోనే నెంబర్-1 గా నిర్వహించాలి: చైర్మన్ డా.రెడ్డివారి గురువారెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించిన కౌన్సిలర్ రాము దోమతెరలతో వ్యాధులు దూరం - డాక్టర్ బేతం హర్ష జాతీయ స్థాయి పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని

*మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు*

Select Suryaa Now
*మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు*

మధిర, సూర్య మేజర్ న్యూస్: మధిర పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా,ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ ప్రథమ కర్తవ్యమని మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాత అన్నారు.గురువారం ఆమె అధ్యక్షతన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో పట్టణాభివృద్ధి,మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పలు కీలక తీర్మానాలకు సభ్యులందరూ ఏకగ్రీవ ఆమోదముద్ర వేశారు.సమావేశం ముగిసిన అనంతరం చైర్ పర్సన్ సుజాత  మాట్లాడారు.మున్సిపాలిటీని ఆర్థికంగా మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.ఇందులో భాగంగా పట్టణంలో అసెస్‌మెంట్ కాని ఆస్తులను,ఆన్‌లైన్ కాని అనధికార నల్లా కనెక్షన్లను గుర్తించి క్రమబద్ధీకరించేందుకు ఇంటింటి సర్వేను ముమ్మరం చేసినట్లు వివరించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. బయో మైనింగ్ పనుల వేగవంతం,వ్యర్థాల శుద్ధికి ఆధునిక యంత్రాల సమకూర్పుతో పాటు పారిశుధ్య వాహనాల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు.పౌరుల ఫిర్యాదుల తక్షణ పరిష్కారం కోసం ప్రత్యేక వాట్సాప్ వ్యవస్థను,పారిశుధ్య పనుల పర్యవేక్షణకు అత్యాధునిక స్వచ్ఛ ఏఐ సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు.రానున్న కాలంలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, పట్టణ ప్రజలకు ఎలాంటి నీటి ఎద్దడి తలెత్తకుండా పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేశామని సామినేని సుజాత  పేర్కొన్నారు.బోర్లు మరియు మోటార్ల మరమ్మతు పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందన్నారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సామ్యూల్ పాల్, వైస్ చైర్మన్ కోన ధని కుమార్, కౌన్సిలర్లు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.