BREAKING
చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికలు ప్రారంభం అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి వర్షిత్‌కు జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కలిసికట్టుగా పని చేద్దాం సర్పంచ్ ఎన్నికల్లో గెలుద్దాం ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి సభకు సిద్దిపేటలో ఏర్పాట్లు షురూ! బ్రహ్మాసముద్రం మండలం,ఎరిడికేరా సర్పంచ్ అభ్యర్థి గా గాజుల కుమార్ ఎన్నిక. పీఎం శ్రీ పాఠశాలలో కెరీర్ గైడెన్స్, బాలికా సాధికారత, అడోలసెంట్ క్లబ్ కార్యక్రమాలు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు శ్రీ కాళహస్తి మున్సిపాలిటీ చైర్మన్ కొరకు సర్వే కూరగాయల సాగుతో అదనపు ఆదాయం ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కూటమి విజయంతో రాష్ట్రానికి ఆదర్శం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ధ్యానంతో మానసిక ప్రశాంతత.. అహింసా జగత్‌ పిరమిడ్‌ ధ్యాన ఆశ్రమం ప్రారంభం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మంటలు ఆర్బీఐ రెడ్ లైన్ దాటిన రిటైల్ ద్రవ్యోల్బణం: అక్టోబర్‌లో రెండేళ్ల గరిష్టం 6.09% నమోదు

పీవీకే-5 కార్మికులకు సర్ఫేస్ కన్వర్ఈషన్

Select Suryaa Now
పీవీకే-5 కార్మికులకు సర్ఫేస్ కన్వర్ఈషన్

ఏఐటీయూసీ పోరాట ఫలితం.. 
-పీవీకే-5 కార్మికులకు సర్ఫేస్ కన్వర్ఈషన్
-ఈ  నెల 17న సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ కౌన్సెలింగ్ 
-జక్కుల గట్టయ్య 
కొత్తగూడెం సింగరేణి, సూర్య(మేజర్ న్యూస్)- కొత్తగూడెం ఏరియాలోని పీవీకే-5 ఇంక్లైన్ భూగర్భ గనిలో విధులు నిర్వహిస్తున్న జనరల్ అసిస్టెంట్ కార్మికులకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ కన్వర్షన్‌కు ఎట్టకేలకు మార్గం సుగమమైంది.గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ చేసిన నిరంతర పోరాటం, యాజమాన్యంపై తీసుకువచ్చిన ఒత్తిడి ఫలితంగా ఈ నెల 17వ తేదీన సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు యాజమాన్యం అంగీకరించిందని కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి జక్కుల గట్టయ్య గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.ఎన్నో సంవత్సరాలుగా సర్ఫేస్ కన్వర్షన్ కోసం ఎదురుచూస్తున్న భూగర్భ గని కార్మికుల ఆశలు ఎట్టకేలకు నెరవేరబోతున్నాయని, ఇది కార్మికుల ఐక్యతకు, ఏఐటీయూసీ పోరాట పటిమకు దక్కిన విజయమని ఆయన పేర్కొన్నారు.మొదట సింగరేణి వ్యాప్తంగా సీనియారిటీ జాబితా ఆధారంగా సర్ఫేస్ కన్వర్షన్ చేపట్టాలని యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేసిందని, అయితే ఈ విధానం వల్ల పీవీకే-5 పద్మావతి భూగర్భ గనిలో పనిచేస్తున్న కార్మికులకు అన్యాయం జరుగుతుందని గుర్తించిన ఏఐటీయూసీ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిందని గట్టయ్య తెలిపారు.ఏఐటీయూసీ ఒత్తిడితో యాజమాన్యం గతంలో విడుదల చేసిన సర్క్యులర్‌ను రద్దు చేసిందని పేర్కొన్నారు. ఆ తర్వాత సర్ఫేస్ టు సర్ఫేస్ కార్మికుల బదిలీల ప్రక్రియ చేపట్టి, ఆ ప్రక్రియ అనంతరం మిగిలే ఖాళీలను అండర్‌గ్రౌండ్ కార్మికులతో సర్ఫేస్ కన్వర్షన్ ద్వారా భర్తీ చేస్తామని యాజమాన్యం మరో సర్క్యులర్ విడుదల చేసిందని తెలిపారు. ఈ విధానాన్ని సైతం ఏఐటీయూసీ వ్యతిరేకిస్తూ పోరాటాన్ని కొనసాగించిందన్నారు.ఈ సమస్య పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం ఎదుట భారీ ఎత్తున నిరాహార దీక్షలు నిర్వహించామని, పలుమార్లు డైరెక్టర్లకు, జనరల్ మేనేజర్‌కు వినతిపత్రాలు సమర్పించామని గట్టయ్య వివరించారు.
ఈ నిరంతర పోరాటాల ఫలితంగానే ఈ నెల 17వ తేదీన సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు యాజమాన్యం అంగీకరించిందని, ఈ ప్రక్రియ ద్వారా సుమారు 145 పోస్టులను సాధించుకోవడం ఏఐటీయూసీ ఉద్యమ విజయానికి నిదర్శనమని స్పష్టం చేశారు.