ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి సభకు సిద్దిపేటలో ఏర్పాట్లు షురూ!
సిద్దిపేట,అర్బన్ : ఈ నెల 19న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటలో పాల్గొననున్న భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సన్నాహాలు ప్రారంభించాయి. సభను విజయవంతంగా నిర్వహించేందుకు సభా ప్రాంగణం ఎంపికతో పాటు ఇతర ఏర్పాట్లపై నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు.ఇందులో భాగంగా సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ నాగదేవత ఆలయం సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు. భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉండటంతో సభా ప్రాంగణం అనుకూలత, వాహనాల పార్కింగ్, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని నాయకులు భావిస్తున్నారు.ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా చర్చించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంప మహేందర్, ఆత్మ కమిటీ చైర్మన్ పూజాల గోపికృష్ణ, సిద్దిపేట రూరల్ మండల నాయకులు గుర్రం అంజిరెడ్డి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు రషీద్, రాజ బహదూర్ రెడ్డి, కొత్త మహిపాల్ రెడ్డి, ఎర్ర మహేందర్, అక్బర్, చందీ శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ బుస్స రాజశేఖర్, అతిఫ్, అంబటి మహేష్, జనార్దన్ రెడ్డి, దేశెట్టి నరేష్, పవన్ కుమార్, ఏఎంసీ డైరెక్టర్ ప్రభాకర్, సర్పంచ్ నవీన్, తిరుపతి, బింగి రాజు, నవీన్ ముదిరాజ్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.