శ్రీకాళహస్తి సూర్య న్యూస్: శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఛైర్మన్ అభ్యర్థి కోసం కసరత్తు, ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టినతెలుగుదేశం పార్టీ అధిష్టానం.
శ్రీకాళహస్తి పట్టణం పురపాలక సంఘం ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిపికేషన్ విడుదల చేయడంతో శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఛైర్మన్ ఎంపిక కోసం కసరత్తు ప్రారంభమైంది. ఈ పురపాలక సంఘం కూటమి ఒప్పందంలో భాగంగా టీడీపీకి కేటాయించారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఛైర్మన్ పదవి బీసీ జనరల్ కు కేటాయించిన సంగతి తెలిసిందే. ఛైర్మన్ పదవి కోసం బీసీ సామాజిక వర్గానికి చెందిన నాగమల్లి దుర్గాప్రసాద్, పేట బాలాజీరెడ్డి, గుమ్మడిపూడి దశరథాచారి ప్రధానంగా పోటీ పడుతున్నారు. వారితో పాటు మాజీ కౌన్సిలరు రేణుకమ్మ పేరును టీడీపీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంది. పేట బాలాజీరెడ్డి వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు. గుమ్మడి దశరథాచారిది విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం. నాగమల్లి దుర్గాప్రసాద్ రజక సామాజిక వర్గానికి చెందిన వాడు కాగా... రేణుకమ్మది విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం. ఈ నలుగురి పేరున గురువారం సాయంత్రం టీడీపీ అధిష్టానం ఐవీఆర్ ఎస్ సర్వే నిర్వహించింది. ఈ నలుగురి పేర్లపై అభిప్రాయం చెప్పాలని టీడీపీ శ్రేణులను ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా అడిగారు. ఈ నేపథ్యంలో అందరిలో ఉత్కంఠ నెలకొంది.
వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి