BREAKING
యూఏఈ తీరంలో ప్రక్షేపక దాడికి గురైన చమురు ట్యాంకర్ సైనిక వీరుల త్యాగాలకు సరికొత్త హంగులతో గాలంట్రీ అవార్డ్స్ పోర్టల్ ప్రారంభం శ్రీ మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి దంపతులు దేశవ్యాప్తంగా 'ఒక దేశం - ఒక రేషన్ కార్డు' పథకం భారతీయుడు 2 షూటింగ్ ప్రమాదంపై కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ రోజు త్రుటిలో ప్రాణాలు దక్కాయి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని కుందన రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స ప్రధానమంత్రి 'పీఎం రాహత్' పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి.. రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు తండ్రి గురించి తరుణ్ భాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. ఆ మాటలు వింటే కన్నీళ్లాగవు మహిళలు, బాలికల భద్రతకు ‘షీ బాక్స్‌’లు ఫిర్యాదులు, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచాలి - జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.. సీతానగరం మండలంలో ప్రపంచ న్యూమోనియా దినోత్సవం ఓటీటీలోకి విశ్వక్ సేన్ కల్ట్ సినిమా.. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే? జబర్దస్త్ శ్రీవిద్య సంచలన వ్యాఖ్యలు.. కెరీర్ ప్రారంభంలో పడిన కష్టాలు, వైరల్ ఫేమ్ వెనుక అసలు నిజాలు వృత్తి విద్యా ఉపాధ్యాయులకు మూడు రోజుల కౌశల్ బోధ్ శిక్షణ స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం..

పీఎం శ్రీ పాఠశాలలో కెరీర్ గైడెన్స్, బాలికా సాధికారత, అడోలసెంట్ క్లబ్ కార్యక్రమాలు

Select Suryaa Now
పీఎం శ్రీ పాఠశాలలో కెరీర్ గైడెన్స్, బాలికా సాధికారత, అడోలసెంట్ క్లబ్ కార్యక్రమాలు

కోహెడ ; కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పీఎం శ్రీ  పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాల, నాగసముద్రాల–కోహెడ నందు గురువారం జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణుల మార్గదర్శకత్వంలో మెంటరింగ్ ఎక్స్‌పర్ట్ టాక్, కెరీర్ గైడెన్స్, బాలికా సాధికారత (గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ ) మరియు అడోలసెంట్ క్లబ్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాల, కరీంనగర్ తాడూరి శ్రీనివాస్ ఆచార్య, లీడ్ ఇండియా ట్రైనింగ్ మేనేజర్ మరియు మోటివేషనల్ స్పీకర్ జి. నాగేశ్వర్ గాలిపెల్లి, సైకాలజిస్ట్, రీసెర్చ్ స్కాలర్ మరియు ట్రాన్స్‌ఫర్మేషన్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ బొల్లంపల్లి సత్య ప్రకాష్, మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్ మరియు గ్రాఫాలజిస్ట్ చిరంజీవి గారు, మోటివేషనల్ స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిపుణులు విద్యార్థులకు జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవడం, తమలోని నైపుణ్యాలను గుర్తించడం, భవిష్యత్తులో ఉన్నత విద్య మరియు ఉద్యోగ అవకాశాలను ఎలా ఎంచుకోవాలి అనే అంశాలపై విలువైన సూచనలు, మార్గదర్శకత్వం అందించారు. ముఖ్యంగా విద్యార్థులు తమ అభిరుచులు, సామర్థ్యాలకు అనుగుణంగా సరైన కెరీర్‌ను ఎంపిక చేసుకోవాలని సూచించారు. అలాగే బాలికా సాధికారత కార్యక్రమంలో భాగంగా బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, విద్య, ఆరోగ్యం, వ్యక్తిగత భద్రత, స్వీయ గౌరవం, నాయకత్వ లక్షణాలు మరియు సమాజంలో సమాన అవకాశాల ప్రాముఖ్యతను నిపుణులు వివరించారు.