BREAKING
వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విగ్రహ ధ్వంసం హేయమైన చర్య : దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి : రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి డిమాండ్ వెయ్యి కోట్ల క్లబ్‌లో రామాయణం.. మేకింగ్ ఫొటోలతో రవి దూబే జోష్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన కుందన లీడిట్ పరిశ్రమ ప్రతినిధులతో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ కీలక చర్చలు భారత్ - శ్రీలంక మధ్య సాంకేతిక భాగస్వామ్యం రాజమహేంద్రవరం కు ఎన్నికల నేపాల్‌లో లోయలో పడిన ఎలక్ట్రిక్ వాహనం.. పద్నాలుగు మంది మృతి యూఏఈ తీరంలో ప్రక్షేపక దాడికి గురైన చమురు ట్యాంకర్ సైనిక వీరుల త్యాగాలకు సరికొత్త హంగులతో గాలంట్రీ అవార్డ్స్ పోర్టల్ ప్రారంభం శ్రీ మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి దంపతులు దేశవ్యాప్తంగా 'ఒక దేశం - ఒక రేషన్ కార్డు' పథకం భారతీయుడు 2 షూటింగ్ ప్రమాదంపై కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ రోజు త్రుటిలో ప్రాణాలు దక్కాయి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని కుందన రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స ప్రధానమంత్రి 'పీఎం రాహత్' పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి.. రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికలు ప్రారంభం

Select Suryaa Now
శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికలు ప్రారంభం

మోగిన మున్సిపల్ భేరి 
- రేపటి నుండి నామినేషన్లు 
- ⁠26 న పోలింగ్ 
- ⁠30 వతేదీ ఓట్ల లెక్కింపు,

శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలకు తెర లేచింది . చైర్మన్ తో పాటు 44 వార్డు కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు . శనివారం నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది . చైర్మన్ పదవి బిసి కేటగిరీ కి రిజర్వ్ చేశారు . అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది.

నామినేషన్ కేంద్రాలు ఇవీ..
చైర్‌ పర్సన్ పదవికి, శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయం, మొదటి అంతస్తు 
వార్డులు : 
1 నుండి 8 వరకు: అరుంధతి దేవి నగర్-1 స్వర్ణ వార్డు సచివాలయం, మున్సిపల్ కార్యాలయం ప్రాంగణం 
9 నుండి 16 వరకు: మెప్మా భవనం, శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయం ప్రాంగణం 
17 నుండి 32 వరకు: మున్సిపల్ కౌన్సిల్ హాల్, మొదటి అంతస్తు, మున్సిపల్ కార్యాలయం 
33 నుండి 44 వరకు: మల్టీ పర్పస్ హాల్, ఆర్డీఓ కార్యాలయం ప్రాంగణం

ఎన్నికల ప్రక్రియ ఇలా 
14 వ తేదీ : వార్డుల వారీగా ఓటరు జాబితాల ప్రదర్శన , ఎన్నికల నోటిఫికేషన్ ప్రచురణ

నామినేషన్ల స్వీకరణ : 
14 నుండి 16 వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు

నామినేషన్ల పరిశీలన :
17 వ తేదీ ఉదయం 11.00 గంటల నుండి

నామినేషన్ల  ఉపసంహరణ : 
19 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు
3 గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థులు తుది జాబితా ప్రచురణ  

పోలింగ్ :
26వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 
ఓట్ల లెక్కింపు : 
30వ తేదీ ఉదయం 8 గంటల నుండి

అభ్యర్థులకు  గరిష్ఠ ఎన్నికల వ్యయ పరిమితులు:  
చైర్‌ పర్సన్ అభ్యర్థి రూ.20  లక్షల రూపాయలు

కౌన్సిలర్ అభ్యర్థి: రూ.7 లక్షల 50 వేలు

ప్రశాంత ఎన్నికలకు సహకరించండి : కమిషనర్ 
అభ్యర్థులు తమకు సంబంధించిన నామినేషన్లను నిర్ణయించిన కేంద్రాలలో సమర్పించాలని  కమిషనర్ కృష్ణా రెడ్డి కోరారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పట్టణ ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు,  అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని  తప్పనిసరిగా పాటించాలని కోరారు.  వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి