అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి వర్షిత్‌కు జగన్‌మోహన్‌రెడ్డి భరోసా
ప్రొద్దుటూరు మేజర్ న్యూస్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రొద్దుటూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి గురువారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన వర్షిత్ అనే చిన్నారి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయాన్ని జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. చిన్నారి వర్షిత్ ఆరోగ్య పరిస్థితి, కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయనకు వివరించి, ఆ కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నారిని కలిసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ భరోసా కల్పించారు. కష్టకాలంలో అధైర్యపడవద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. తమ సమస్యను పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లి చిన్నారికి భరోసా కల్పించడంలో రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చొరవ చూపడం పట్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్పడ్డారని ఆరోపిస్తున్న దౌర్జన్యాలు, అక్రమాలు, ప్రతిపక్ష అభ్యర్థులు ఎదుర్కొన్న ఇబ్బందులు తదితర అంశాలను రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వివరించారు. స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ, నియోజకవర్గంలో చోటుచేసుకున్న పరిణామాలను ఆయనకు వివరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి పాల్గొన్నారు. చిన్నారి ఆరోగ్య సమస్యతో పాటు ప్రొద్దుటూరు రాజకీయ పరిణామాలను పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లడం ఈ సమావేశంలో ప్రధాన అంశాలుగా నిలిచాయి.
-షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా