చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ
సిద్దిపేట, అర్బన్ :పాఠశాల స్థాయిలో నిర్వహించిన చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. విద్యార్థులు ఉత్సాహంగా పరీక్షలో పాల్గొని తమ విజ్ఞానం, సృజనాత్మకత, ఆలోచనా నైపుణ్యాలను ప్రదర్శించారు.ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన పదో తరగతి విద్యార్థిని పి. దీక్షిత, తొమ్మిదో తరగతి విద్యార్థి కె. అభినవ్, ఎనిమిదో తరగతి విద్యార్థిని ఎం. సహస్రలను ఈ నెల 21న నిర్వహించనున్న మండల స్థాయి చకుముఖి పోటీలకు ఎంపిక చేసినట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. సత్యం మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిలో సృజనాత్మకత, విజ్ఞానం, తార్కిక ఆలోచనా శక్తిని పెంపొందించేందుకు ఇలాంటి టాలెంట్ టెస్టులు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.మండల స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించి, తదుపరి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.