BREAKING
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘హైందవ’ నుంచి మెస్మరైజింగ్ రొమాంటిక్ మెలోడీ ‘ఎవరైనా’ విడుదల.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్! గ్రంథాలయాలు విజ్ఞానాలయాలు రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలి : ఇంకొల్లు సి.ఐ రామ్‌ నాయక్‌ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సిపిఎస్ నుంచి ఓపిఎస్ కు అవకాశం డిసెంబర్ 31 లోపు నిధి పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి : డిఇఓ వైఎస్ జగన్‌ను కలిసిన చవ్వా రాజశేఖర్ రెడ్డి *మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు* *మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు* ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి కటారు చిన్న రాజా యాదవ్ మద్దతు పంచాయతీ ఎన్నికల విధులు అదే మండలం లేదా పక్క మండలంలో కేటాయించాలి.. ఎస్‌టీయూ వినతి క్రిస్మస్ కానుకగా ‘రియాలిటీ’ విడుదల.. ‘రుత్తూ’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, డైరెక్టర్ కిరణ్ అబ్బవరం! చంద్రబాబు ఆలోచన మరో పారిశ్రామిక విప్లవానికి నాంది పలకనుంది : Dr. గొట్టిపాటి లక్ష్మీ విద్యార్థులకు ఆధ్యాత్మిక భావన అవసరం రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు కెల్ల విద్యార్థులు _జూలకల్లు పాఠశాలలను తనిఖీ చేసిన మండల విద్యాశాఖ అధికారి ఖాసీం_ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఎండీ ఖాసీం మండలంలోని జూలకల్లు గ్రామంలో గల మండల ప్రాథమిక పాఠశాల (ఉర్దూ) మరియు మండల ప్రాథమిక పాఠశాల (ప్రధాన) లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులతో సమావేశం

రాష్ట్రంలో ‘సెక్యూరిటీ ఇన్నోవేషన్ శాండ్‌బాక్స్’: హోం మంత్రి అనిత వెల్లడి

Select Suryaa Now
రాష్ట్రంలో ‘సెక్యూరిటీ ఇన్నోవేషన్ శాండ్‌బాక్స్’: హోం మంత్రి అనిత వెల్లడి

విశాఖపట్నం, మేజర్‌న్యూస్‌ :
భవిష్యత్ యుద్ధ తంత్రం పూర్తిగా మారిపోయిందని, సంప్రదాయ ఆయుధాల స్థానంలో డ్రోన్లు, కృత్రిమ మేధ (ఏఐ), సైబర్ భద్రత కీలక పాత్ర పోషిస్తున్నాయని సీఐఐ భాగస్వామ్య సదస్సులో వక్తలు పేర్కొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో జరుగుతున్న సిఐఐ సదస్సులో భాగంగా గురువారం ‘భద్రత, సాంకేతికత, వృద్ధి’ అంశంపై నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఆర్థిక వృద్ధి, జాతీయ భద్రత ఒకే నాణేనికి రెండు వైపులని చెప్పారు. ఓర్వకల్లులో నిర్మిస్తున్న ‘డ్రోన్ సిటీ’ పరిశోధన, తయారీ రంగాలకు కేంద్రంగా మారనుందని తెలిపారు. స్టార్టప్‌లు, పరిశ్రమలు డ్రోన్లు, యాంటీ-డ్రోన్ వ్యవస్థలను పరీక్షించుకునేందుకు రాష్ట్రంలో ‘సెక్యూరిటీ టెక్నాలజీ ఇన్నోవేషన్ శాండ్‌బాక్స్’ ఏర్పాటు చేస్తున్నామని, సింగిల్ విండో విధానంలో 3-7 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ‘ఏఐ4ఏపీ’, 15 వేల కెమెరాలతో ‘సీసీటీవీ 360’ వ్యవస్థలను అమలు చేస్తున్నామని, మహిళలకు అత్యంత సురక్షిత నగరాల్లో విశాఖ ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు, డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. రక్షణ తయారీ రంగంలో ఏపీ అగ్రగామిగా ఎదుగుతోందన్నారు. దొనకొండలో 2,000 ఎకరాల్లో భారీ డీఆర్‌డీఓ కేంద్రంతో పాటు బీడీఎల్, బీఈఎల్, భారత్ ఫోర్జ్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని వెల్లడించారు. కర్నూలు, జగ్గయ్యపేట ప్రాంతాలు ప్రొపల్షన్, రక్షణ పరికరాల తయారీ కేంద్రాలుగా మారుతున్నాయని, విశాఖలో ఆమ్కా  ప్రాజెక్టుకు కేవలం 36 రోజుల్లోనే శంకుస్థాపన పూర్తి చేశామని తెలిపారు. సమన్వయకర్త లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా (విశ్రాంత) మాట్లాడుతూ.. ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు ఆధునిక డ్రోన్ సాంకేతికత శక్తిని ప్రపంచానికి చాటాయని, భారత్ కూడా పరిశోధన వేగవంతమైన తయారీపై దృష్టి సారించాలని సూచించారు. ఈ చర్చలో ఎల్ అండ్ టీ ప్రతినిధి అరుణ్ రామ్‌చందానీ, బీఏఈ సిస్టమ్స్ ఎండీ టోనీ వాల్టన్, అరుణ్ రాజిందర్ సింగ్ భాటియా (కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ ఛైర్మన్) కూడా ఈ చర్చలో పాల్గొని రక్షణ రంగంలో స్టార్టప్‌ల భాగస్వామ్యం, సాంకేతిక ఆవిష్కరణల ఆవశ్యకతను వివరించారు.