సిపిఎస్ నుంచి ఓపిఎస్ కు అవకాశం డిసెంబర్ 31 లోపు నిధి పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి : డిఇఓ
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : డీఎస్సీ 2003 కు చెందిన ఉపాధ్యాయులు సిపిఎస్ నుండి ఓపిఎస్ కు మారెందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని డీఈఓ కేవియన్ కుమార్ తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు నిధి పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో డిసెంబర్ 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని 2003 బ్యాచ్ కు చెందిన ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆ ప్రకటలో తెలిపారు. మరిన్ని వివరాలకు డీఈఓ కార్యాలయంలోని అజయ్ వర్ధన్ ను 8498991250 నెంబర్ నందు సంప్రదించాలని సూచించారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్