గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ
అరకులోయ, నవంబర్ 13, మేజర్ న్యూస్:
గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై శుక్రవారం శిక్షణా తరగతులు నిర్వహించారు.స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారి స్టేజ్ వన్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఎన్నికల విధివిధానాలు, ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలు,అధికారుల బాధ్యతలు,పోలింగ్ ప్రక్రియ,ఎన్నికలను పారదర్శకంగా,ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో వీసం.ప్రసాద్, తహసీల్దార్ గుంటూరు. శ్రీధర్,మండల విద్యాశాఖ అధికారిణి ప్రధాని.భారతి రత్నం తదితరులు పాల్గొన్నారు.