BREAKING
పండ్ల రసం తాగడం మంచిదా లేక నేరుగా పండ్లు తినడమే ఆరోగ్యానికి మేలా.. అసలు నిజాలు ఇవే! ???? నాగపూజ – సంతాన భాగ్యానికి జ్యోతిష్య రహస్యం | Naga Pooja & Progeny Blessings ???? హోదా కోసం కాదు.. గ్రామ అభివృద్ధి బాధ్యత కోసం మీలో ఒక్కడిగా ఉంటా..సర్పంచ్ అభ్యర్థి గడ్డం శివ ఎగ్జిక్యూటివ్ వేతనాల వెల్లడి నిబంధనలను సడలించాలని అమెరికన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ప్రతిపాదన ఆర్మ్ (Arm) సీఈఓ పదవి కోసం రేనే హాస్‌ను సంప్రదించిన ఎన్విడియా తెల్ల అన్నం మంచిదా లేక బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మేలా.. అసలు నిజాలు ఇవే! డిజిటల్ కంటెంట్ బిల్లును రెండోసారి వీటో చేసిన పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రాకి పూలదండలకు బదులు పుస్తకాలు.. అభినందనల్లో వినూత్న ఒరవడి ప్రముఖ పిల్లల పుస్తకాల రచయిత, హాస్యనటుడు డేవిడ్ వాలియమ్స్‌పై దర్యాప్తునకు లండన్ పోలీసుల నిర్ణయం బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక సంబంధాలకే భారత్ పెద్దపీట స్థానిక ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించిన డి.ఎస్.పి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు సొంతం చేసుకున్న దీప్తి శర్మ.. రెండోసారి అరుదైన ఘనత! గుజరాత్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ: సీఎం, మంత్రులతో విందు సమావేశం అస్సాం ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం కేన్సర్ మందుల ధరల నియంత్రణపై ఎన్‌పీపీఏ కఠిన నిఘా

ప్రతి రైతుకు డిజిటల్ గుర్తింపు.. వ్యవసాయ సేవలకు సరికొత్త భరోసా.

Select Suryaa Now
ప్రతి రైతుకు డిజిటల్ గుర్తింపు.. వ్యవసాయ సేవలకు సరికొత్త భరోసా.

           జిల్లాలో 1,43,000 మంది రైతులకు ఫార్మర్ ఐడీలు..:జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్..
అమలాపురం మేజర్ న్యూస్ వ్యవసాయ రంగాన్ని డిజిటల్ పరిజ్ఞానంతో అనుసంధానిస్తూ దేశంలోని ప్రతి రైతుకు ప్రత్యేక డిజిటల్ గుర్తింపును కల్పించాలనే ప్రధానమంత్రి లక్ష్యంలో భాగంగా అగ్రి స్టాక్  కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం అమలులో భాగంగా జిల్లాస్థాయి అగ్రి స్టాక్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించి సంబంధిత శాఖల అధికారులతో పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి రైతుకు 11 అంకెలతో కూడిన ప్రత్యేక యూనిక్ ఫార్మర్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ను అందించడం అగ్రి స్టాక్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. జిల్లాలోని 297 రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి రైతును ఈ డిజిటల్ గుర్తింపు వ్యవస్థలో నమోదు చేసి, ప్రత్యేక గుర్తింపు కార్డులు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లాలో ఇప్పటివరకు 1,43,000 మంది రైతులకు 11 అంకెల ప్రత్యేక ఫార్మర్ ఐడీలు సృష్టించినట్లు వెల్లడించారు. మిగిలిన రైతుల వివరాలను కూడా సమగ్రంగా నమోదు చేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.
ఒకే డిజిటల్ గుర్తింపు కార్డులో రైతుకు సంబంధించిన సమగ్ర సమాచారం!
అగ్రి స్టాక్ ఫార్మర్ ఐడీ ద్వారా రైతు వ్యక్తిగత వివరాలు, సాగు చేస్తున్న పంటల వివరాలు, వ్యవసాయ భూముల వివరాలు, సాగునీటి సదుపాయాలు, పంటల సాగు విధానం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు (ప్రొక్యూర్‌మెంట్), పంటల విక్రయాలు, మార్కెటింగ్ ద్వారా పొందిన ఆదాయం వంటి సమగ్ర సమాచారాన్ని డిజిటల్ రూపంలో అనుసంధానం చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.
రైతులకు మరింత చేరువగా ప్రభుత్వ సేవలు!
ప్రత్యేక ఫార్మర్ ఐడీ ద్వారా రైతులకు ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సేవలు మరింత పారదర్శకంగా, సులభంగా అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటలకు అవసరమైన యూరియా, ఇతర ఎరువులు, క్రిమిసంహారక మందులు తదితర వ్యవసాయ అవసరాలను సకాలంలో అందించేందుకు ఈ డిజిటల్ వ్యవస్థ దోహదపడుతుందని పేర్కొన్నారు.
రైతులందరికీ ప్రత్యేక డిజిటల్ గుర్తింపు కల్పించడం ద్వారా వ్యవసాయ రంగంలో సమాచార సమీకరణ, ప్రభుత్వ పథకాల అమలు, రైతులకు సేవల పంపిణీలో మరింత పారదర్శకత, సమర్థత పెరుగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలోని ప్రతి రైతుకు ఫార్మర్ ఐడీ అందేలా క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.