ఆదివాసీ మహిళకు అగ్రతాంబూలం
అరకులోయ,నవంబర్ 13, మేజర్ న్యూస్:
రాజకీయ రంగంలో అత్యంతంగా వెనుకబడిన ఆదివాసీ తెగలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానం కల్పించింది.నూతనంగా ఏర్పాటైన అల్లూరి సీతారామరాజు జిల్లా తొలి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్థానాన్ని పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్( పివిటిజి) సామాజిక వర్గానికి చెందిన మహిళకు కేటాయించి వైఎస్సార్‌సీపీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా పెదబయలు మండల జెడ్పీటీసీ స్థానం నుంచి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన వంతల.శాంతిని అల్లూరి సీతారామరాజు జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం అధికారికంగా ప్రకటించారు. అదేవిధంగా జెడ్పీ వైస్ చైర్మన్‌గా పాడేరు మండల జెడ్పీటీసీ సభ్యుడు సీదరి. రాంబాబు పేరును ఖరారు చేసి ప్రకటించారు.కొత్తగా ఆవిర్భవించిన అల్లూరి సీతారామరాజు జిల్లా
పరిధిలోని 11 జెడ్పీటీసీ స్థానాలకు గానూ 7 స్థానాలను కైవసం చేసుకుని వైఎస్సార్‌సీపీ జెడ్పీ పీఠాన్ని దక్కించుకుంది.ఈ నేపథ్యంలో అల్లూరి జిల్లాలోని పలువురు సీనియర్ల పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ సమాజంలో అత్యంత అణగారిన, ఇప్పటివరకు ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యం లేని 'పివిటిజి' తెగకు చెందిన వంతల.శాంతిని ఎంపిక చేయడం ద్వారా సామాజిక న్యాయానికి తాము కట్టుబడి ఉన్నామని వైఎస్సార్‌సీపీ నిరూపించింది.
విద్యావంతురాలు, నిరాడంబరురాలైన వంతల. శాంతిని అత్యున్నతమైన జెడ్పీ పీఠంపై కూర్చోబెట్టడం పట్ల ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన ప్రజలు, పివిటిజి సామాజిక వర్గ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల. కన్నబాబు,అరకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ గుమ్మ.తనుజారాణి, ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా.రవి బాబు,స్థానిక ఎమ్మెల్యే రేగం.మత్స్యలింగం, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు,మాజీ ఎమ్మెల్యే శోభా. హైమావతి సమక్షంలో గిరిజన నేతలు పార్టీ అధినాయకుడు,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సరికొత్త శాంతి లభిస్తుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ గా వంతల.శాంతిని నియమించడం పట్ల ఓ పక్క ఆదివాసీ గిరిజనులు, మరోపక్క పార్టీ నాయకులు,కార్యకర్తలు వర్షం వ్యక్తం చేస్తూ వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.