BREAKING
సేంద్రీయ సాగును ప్రోత్సహిద్దాం.. చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికలు ప్రారంభం అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి వర్షిత్‌కు జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కలిసికట్టుగా పని చేద్దాం సర్పంచ్ ఎన్నికల్లో గెలుద్దాం ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి సభకు సిద్దిపేటలో ఏర్పాట్లు షురూ! బ్రహ్మాసముద్రం మండలం,ఎరిడికేరా సర్పంచ్ అభ్యర్థి గా గాజుల కుమార్ ఎన్నిక. పీఎం శ్రీ పాఠశాలలో కెరీర్ గైడెన్స్, బాలికా సాధికారత, అడోలసెంట్ క్లబ్ కార్యక్రమాలు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు శ్రీ కాళహస్తి మున్సిపాలిటీ చైర్మన్ కొరకు సర్వే కూరగాయల సాగుతో అదనపు ఆదాయం ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కూటమి విజయంతో రాష్ట్రానికి ఆదర్శం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ధ్యానంతో మానసిక ప్రశాంతత.. అహింసా జగత్‌ పిరమిడ్‌ ధ్యాన ఆశ్రమం ప్రారంభం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మంటలు

వైఎస్ జగన్‌ను కలిసిన చవ్వా రాజశేఖర్ రెడ్డి

Select Suryaa Now
వైఎస్ జగన్‌ను కలిసిన చవ్వా రాజశేఖర్ రెడ్డి

అనంతపురంబ్యూరో, మేజర్ న్యూస్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చిత్తూరు జిల్లా వైసీపీ పరిశీలకులు, సీనియర్ నాయకులు చవ్వా రాజశేఖరరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయంతో పాటు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయం, భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు చవ్వా రాజశేఖరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చవ్వా రాజశేఖరరెడ్డిని అభినందించారు. అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవడంలో నాయకులు, కార్యకర్తలు, స్థానిక శ్రేణుల సమిష్టి కృషి కీలకంగా నిలిచిందని పేర్కొన్నట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో నాయకుల మధ్య సమన్వయం, కార్యకర్తల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో చేసిన ప్రయత్నాలు విజయానికి దోహదపడ్డాయని అభిప్రాయపడినట్లు తెలిపారు. వైఎస్ జగన్‌తో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీ సందర్భంగా పార్టీ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించామని చవ్వా రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. పార్టీ అధినేత సూచనలకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్.