సేంద్రీయ సాగును ప్రోత్సహిద్దాం..
చిన్నకోడూరు, : రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని క్రమంగా తగ్గిస్తూ సేంద్రీయ సాగును ప్రోత్సహించాలని కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పీఏసీఎస్ అధ్యక్షులు సాయికుమార్ పిలుపునిచ్చారు. గురువారం చిన్నకోడూరు మండలంలోని రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఎఫ్‌పీఓను కామారెడ్డి జిల్లా రైతులు సందర్శించారు.ఈ సందర్భంగా ఎఫ్‌పీఓ డైరెక్టర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సీఈఓ మల్లారెడ్డి సంస్థ పనితీరు, రైతులకు అందిస్తున్న సేవలు, సహాయ సహకారాల గురించి వివరించారు.అనంతరం రైతులు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్నందున ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భూగర్భ జలాలను పొదుపుగా వినియోగించుకుంటూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని పేర్కొన్నారు.ఎఫ్‌పీఓలో రైతులకు అందుబాటులో ఉన్న హార్వెస్టర్, ట్రాక్టర్‌తో పాటు వివిధ వ్యవసాయ యంత్రాలు, పరికరాలను సందర్శక రైతులు పరిశీలించారు. వాటి పనితీరు, సామర్థ్యం, నిర్వహణ విధానం, అద్దె ధరలు, మరమ్మతులు, ఆపరేటర్ సేవల గురించి ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో భూక్య వెంకన్న, నారాగౌడ్, ఖాజాపాషా, అజయ్ కుమార్ తదితర రైతులు పాల్గొన్నారు.