శాసనమండలి మాజీ విప్ గంగుల సమక్షంలో వైకాపాలో చేరిక
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
రుద్రవరం మండలం, మందలూరు గ్రామానికి చెందిన
పలువురు తెదేపాను వీడి వైకాపాలో చేరారు. గురువారం మందలూరు గ్రామానికి చెందిన నంద్యాల పరమేశ్వర్ రెడ్డి, నంద్యాల పాపిరెడ్డి, వడ్ల రామచంద్ర ఆచారి, చాకలి లింగమయ్యతో పాటు 40 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్నూలు పార్లమెంటు పరిశీలకులు శాసనమండలి మాజీ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రుద్రవరం మండల వైకాపా నాయకులు గంధం రాఘవరెడ్డి ఉన్నారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా