జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో అసత్య ప్రచారాలు ఆపండి,
అనంతసాగరం, మేజర్ న్యూస్ : అనంతసాగరం మండలం లో స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా జరిగిన జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న వైఎస్ఆర్సిపి నాయకులకు తెలుగుదేశం పార్టీ ధీటుగా బదిలిచ్చింది. అనంత సాగరంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మెట్టుకూరి శ్రీహరి రెడ్డి మాట్లాడుతూ అన్యాయాలు అక్రమాలు చేసే సంస్కృతి మీదేనని చిన్న నాయకుల నుంచి మీ పార్టీ అధ్యక్షుడి వరకు విలువలు లేని రాజకీయాలు చేస్తారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం రాజ్యాంగానికి కట్టుబడి పని చేస్తుందని విలువలు నేర్పే పార్టీ అని పెద్దలను గౌరవించే సాంప్రదాయాన్ని మా నాయకులు మాకు నేర్పారని చెప్పారు. అనంతసాగరంలో లేని అసత్యాలు ప్రసారం చేసే విష సంస్కృతికి మరియు రౌడీయిజానికి పునాదులు వేశారని ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల్లో విజయం సాధించిన జడ్పిటిసి ఎంపీటీసీలు పాల్గొన్నారు.