BREAKING
*మధిర మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానాలు* ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి కటారు చిన్న రాజా యాదవ్ మద్దతు పంచాయతీ ఎన్నికల విధులు అదే మండలం లేదా పక్క మండలంలో కేటాయించాలి.. ఎస్‌టీయూ వినతి క్రిస్మస్ కానుకగా ‘రియాలిటీ’ విడుదల.. ‘రుత్తూ’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, డైరెక్టర్ కిరణ్ అబ్బవరం! చంద్రబాబు ఆలోచన మరో పారిశ్రామిక విప్లవానికి నాంది పలకనుంది : Dr. గొట్టిపాటి లక్ష్మీ విద్యార్థులకు ఆధ్యాత్మిక భావన అవసరం రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు కెల్ల విద్యార్థులు _జూలకల్లు పాఠశాలలను తనిఖీ చేసిన మండల విద్యాశాఖ అధికారి ఖాసీం_ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఎండీ ఖాసీం మండలంలోని జూలకల్లు గ్రామంలో గల మండల ప్రాథమిక పాఠశాల (ఉర్దూ) మరియు మండల ప్రాథమిక పాఠశాల (ప్రధాన) లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులతో సమావేశం చంద్రయాన్ విలక్షణమైన కాన్సెప్ట్‌తో అందరినీ అలరిస్తుంది.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో శ్రీవిష్ణు! 13వ తేదీన జిల్లాలో పర్యటించాలి : బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి అరాచకంతో అభివృద్ధితోనే టిడిపి అత్యధిక స్థానాలు గెలిచాం పదోన్నతి పొందిన విజయ్ కుమార్ అభినందనలు తెలిపిన వున్నం అంజనేయులు పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పల్నాడు జిల్లా నరసరావుపేట సిపిడిసిఎల్ ఎస్ఈ గా విధులు నిర్వహించి, పదోన్నతిపై ముఖ్య ఇంజనీరు (సీఈ)గా విజయవాడ సిపిడిసిఎల్ కు వెళ్లిన విజయ్ కుమార్ గారిని విజయవాడలోని సిపిడిసిఎల్ కార్యాలయంలో పిడుగురాళ్ల పుర ఇడుపు కాయితం మంచి ఫ్యామిలీ డ్రామా ఫిలిం.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత బన్నీ వాస్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఇంధన రంగంపై నిర్వహించిన ప్రత్యేక ప్లీనరీ సెషన్ లో మంత్రి నారా లోకేష్ ‘మాయలేడి’ కొత్త తరహా మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. సినిమా విశేషాలు పంచుకున్న హీరో రాకేష్ వర్రే!

ఇక తెలంగాణలో భారత్ విస్తార్ సేవలు

Select Suryaa Now
ఇక తెలంగాణలో భారత్ విస్తార్ సేవలు

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి : వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ, తెలంగాణ రైతులకు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ) ఆధారిత సేవలను వారి మాతృభాష తెలుగులోనే అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఏఐ ఆధారిత జాతీయ వ్యవసాయ డిజిటల్ వేదిక 'భారత్ విస్తార్' తో తెలంగాణను అనుసంధానించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ (ఎన్ఐఎస్‌జీ) మధ్య గురువారం సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో ఒప్పందం జరిగింది.

సాంకేతికతతో వ్యవసాయంలో సమూల మార్పులు తీసుకురావాలి: మంత్రి తుమ్మల


ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయడం ద్వారా సాగు వ్యయాన్ని తగ్గించి, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చవచ్చని పేర్కొన్నారు. పంట సాగులో రైతులు ఎదుర్కొనే సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, శాస్త్రీయమైన సూచనలు అందిస్తే చీడపీడలు, తెగుళ్లు పంట మొత్తం విస్తరించకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టవచ్చని తెలిపారు. వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం, పంట రకం, సాగు సమయం, మార్కెట్ ధరలను విశ్లేషించి రైతులకు అవసరమైన సమయంలో కచ్చితమైన సలహాలు అందించడంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. రైతులు ఎరువులు, పురుగుమందులు, ఇతర వ్యవసాయ ఇన్‌పుట్‌లను అవసరానికి మించి వినియోగించకుండా, సరైన మోతాదులో ఉపయోగించేలా సాంకేతిక సలహాలు అందితే పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు దిగుబడులు, ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు. తెలంగాణలోని ప్రాంతీయ వాతావరణ పరిస్థితులు, నేలల స్వభావం, పంటల వైవిధ్యం, స్థానిక సాగు పద్ధతులు, మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారత్ విస్తార్ వేదికను రాష్ట్ర రైతులకు మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలకు అదనంగా తెలంగాణకు సంబంధించిన వ్యవసాయ పథకాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, పంటల సాగు విధానాలు, శాస్త్రీయ సలహాలు కూడా ఈ వేదికలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

భారత్ విస్తార్ అంటే ఏమిటి?

భారత్ విస్తార్ అనేది కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ రూపొందించిన కృత్రిమ మేధ ఆధారిత జాతీయ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. దేశవ్యాప్తంగా వ్యవసాయానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ వ్యవస్థలు, శాస్త్రీయ పరిశోధనా సంస్థలు, వాతావరణ విభాగాలు, మార్కెట్ సమాచార వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి రైతులకు సమగ్ర సమాచారాన్ని అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. సాధారణంగా రైతులు పంటల సాగు, వాతావరణం, ఎరువుల వినియోగం, చీడపీడల నివారణ, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాల సమాచారం కోసం వివిధ కార్యాలయాలు, వెబ్‌సైట్లు, యాప్‌లపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా భారత్ విస్తార్ ఒకే డిజిటల్ వేదిక ద్వారా అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ వేదికలో పొందుపరిచిన 'భారతి' అనే కృత్రిమ మేధ ఆధారిత వాయిస్ అసిస్టెంట్ రైతులతో సంభాషిస్తూ వారి ప్రశ్నలకు సమాధానాలు అందిస్తుంది. రైతులు తమకు ఎదురైన సమస్యలను వారి మాతృభాషలో మాట్లాడి లేదా టైప్ చేసి అడగవచ్చు. రైతు అడిగిన ప్రశ్నను విశ్లేషించి, అందుబాటులో ఉన్న శాస్త్రీయ సమాచారం, ప్రభుత్వ డేటా ఆధారంగా అవసరమైన సూచనలు అందించడం దీని ప్రత్యేకత.

భారత్ విస్తార్ ద్వారా రైతులకు ఆరు కీలక సేవలు

1. పంటల సాగుపై శాస్త్రీయ సలహాలు: ఏ ప్రాంతంలో ఏ పంట సాగు చేయాలి? ఎప్పుడు విత్తుకోవాలి? ఏ రకమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి? ఎరువులు, నీటి యాజమాన్యాన్ని ఎలా నిర్వహించాలి? వంటి అంశాలపై భారత వ్యవసాయ పరిశోధనా మండలి అందించే శాస్త్రీయ పరిజ్ఞానం ఆధారంగా రైతులకు సూచనలు లభిస్తాయి. 2. వాతావరణ సమాచారం, ముందస్తు హెచ్చరికలు: భారత వాతావరణ శాఖ సమాచారాన్ని అనుసంధానం చేసి వర్షపాతం, ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారం అందుతుంది. దీనివల్ల రైతులు విత్తనాలు వేయడం, సాగునీరు అందించడం, పంట కోత వంటి పనులను వాతావరణానికి అనుగుణంగా ప్రణాళిక చేసుకోవచ్చు. 3. చీడపీడలు, తెగుళ్ల గుర్తింపు: పంటలకు వచ్చే చీడపీడలు, తెగుళ్లను గుర్తించి నివారణ చర్యలపై సలహాలు పొందవచ్చు. పంటకు సంబంధించిన ఫొటోలను పంపించడం ద్వారా అందుబాటులో ఉన్న ఏఐ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో సమస్యను విశ్లేషించి తగిన సూచనలు పొందే అవకాశం ఉంటుంది. నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్ సమాచారాన్ని కూడా ఈ వ్యవస్థ వినియోగిస్తుంది. 4. నేల ఆరోగ్యం, ఎరువుల వినియోగంపై సూచనలు: సాయిల్ హెల్త్ కార్డులు, నేల పరీక్షల సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నేలలోని పోషకాల స్థితి, పంటకు అవసరమైన ఎరువుల వినియోగం, పోషకాల యాజమాన్యంపై సూచనలు అందుతాయి. దీనివల్ల అనవసర ఎరువుల వినియోగాన్ని తగ్గించి సాగు ఖర్చును నియంత్రించవచ్చు. 5. మార్కెట్ ధరలు, విక్రయ సమాచారం: అగ్రిమార్కెట్ నెట్ ద్వారా వివిధ వ్యవసాయ మార్కెట్లలో పంటల ధరలు, మార్కెట్ పరిస్థితుల సమాచారం అందుతుంది. రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడ, ఎప్పుడు విక్రయించాలనే విషయంలో మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇది దోహదపడుతుంది. 6. ప్రభుత్వ పథకాలు, లబ్ధి వివరాలు: పీఎం-కిసాన్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, సాయిల్ హెల్త్ కార్డు, కిసాన్ క్రెడిట్ కార్డు తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల వివరాలు, అర్హతలు, దరఖాస్తుల స్థితి, లబ్ధి వివరాలను ఒకే వేదికపై తెలుసుకోవచ్చు. ఫిర్యాదుల నమోదు, వాటి పరిష్కార స్థితిని కూడా తెలుసుకునే సదుపాయాలు దశలవారీగా అందుబాటులోకి వస్తాయి.

నాలుగు మాధ్యమాల్లో తెలుగు సేవలు

తెలంగాణ రైతులు సులభంగా ఈ సేవలను వినియోగించుకునేలా ఎన్ఐఎస్‌జీ సహకారంతో నాలుగు ప్రధాన మాధ్యమాల్లో భారత్ విస్తార్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.  హెల్ప్‌లైన్ – 155261: ఫోన్ ద్వారా వాయిస్ బాట్ సహాయంతో రైతులు వ్యవసాయ సందేహాలను అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. తెలుగు వాయిస్ సేవలను  అందుబాటులోకి తీసుకురావడంపై చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. వెబ్ పోర్టల్, మొబైల్ యాప్: రైతులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా చాట్‌బాట్‌ను వినియోగించుకుని వ్యవసాయ సమాచారం, సలహాలు పొందేలా ప్రత్యేక రాష్ట్రస్థాయి పోర్టల్, తెలుగు యాప్‌ను ఎంఓయూ కుదిరిన 15 నుంచి 21 రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాట్సాప్ చాట్‌బాట్: వాట్సాప్ ద్వారా రైతులు తమ సందేహాలను పంపించి సమాధానాలు పొందే సదుపాయాన్ని 45 నుంచి 60 రోజుల్లో ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్: తెలుగు వాయిస్ బాట్‌తో కూడిన ప్రత్యేక సేవా నంబర్‌ను కేంద్ర ప్రభుత్వ అనుమతుల అనంతరం ప్రారంభించనున్నారు. దీంతో స్మార్ట్ ఫోన్ ఉన్న రైతులే కాకుండా సాధారణ ఫోన్ వినియోగించే రైతులు కూడా వాయిస్ కాల్ ద్వారా వ్యవసాయ సలహాలు పొందే అవకాశం ఉంటుంది. రైతులు ఏ మాధ్యమం ద్వారా సంప్రదించినా ఒకే సమగ్ర వ్యవస్థ నుంచి విశ్వసనీయమైన సమాచారాన్ని పొందేలా ఈ సేవలను అనుసంధానం చేయనున్నారు.

కేంద్ర, రాష్ట్ర నిధులతో భారత్ విస్తార్ అమలు
భారత్ విస్తార్ జాతీయ వేదికలో భాగస్వామ్యం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమ్మతి తెలియజేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల భాగస్వామ్యంతో భారత్ విస్తార్ అనుసంధాన ప్రక్రియను చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

నాలుగు దశల్లో అమలు

భారత్ విస్తార్ సేవలను తెలంగాణలో సమర్థవంతంగా అమలు చేసేందుకు నాలుగు దశల్లో కార్యాచరణ రూపొందించారు. మొదటి దశలో ఇప్పటికే సిద్ధంగా ఉన్న జాతీయ చాట్‌బాట్, వాయిస్ బాట్ సేవలను తెలుగులో అందుబాటులోకి తీసుకురానున్నారు. రెండో దశలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, ఉత్తర్వులు, పంటల సాగుకు సంబంధించిన సలహాలు, స్థానిక వ్యవసాయ సమాచారాన్ని అనుసంధానం చేస్తారు. మూడో దశలో రైతుల దరఖాస్తులు, పథకాల లబ్ధి, చెల్లింపులు, ఫిర్యాదుల స్థితి వంటి వివరాలను రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలతో అనుసంధానం చేస్తారు. నాలుగో దశలో రైతుల సమ్మతి, సమాచార భద్రతకు సంబంధించిన నిబంధనలను పాటిస్తూ వ్యవసాయ శాఖ అనుమతించిన సమాచారాన్ని మరింత విస్తృతంగా అనుసంధానం చేస్తారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న జాతీయ డిజిటల్ వేదికను వినియోగించుకోవడం వల్ల కొత్త వ్యవస్థను మొదటి నుంచి అభివృద్ధి చేయాల్సిన అవసరం లేకుండా తక్కువ సమయంలో రైతులకు సేవలను అందించవచ్చని అధికారులు తెలిపారు. రాబోయే ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ శాఖ సర్క్యులర్లు, స్థానిక అవసరాలకు సంబంధించిన ప్రత్యేక సేవలను దశలవారీగా ఈ వేదికలో చేర్చనున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో సమాచారానికి సంబంధించిన నిర్ణయాలు, అనుమతులు, యాజమాన్యం వ్యవసాయ శాఖ పరిధిలోనే ఉంటాయని, ఎన్ఐఎస్‌జీ సంస్థ సాంకేతిక సహకారం, వ్యవస్థల అనుసంధానం, అమలు సమన్వయ బాధ్యతలను నిర్వహిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఇందుకోసం వ్యవసాయ శాఖ తరఫున నోడల్ అధికారిని నియమించి, రాష్ట్రానికి సంబంధించిన సమాచారాన్ని ధ్రువీకరించి అందించనున్నారు.

రైతు ముంగిటకే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం

వ్యవసాయ రంగంలో సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, రైతులు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా చేయడం భారత్ విస్తార్ ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా స్థానిక భాషలో వాయిస్ ఆధారిత సేవలు అందుబాటులోకి రావడం వల్ల సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన తక్కువగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు అందించే సలహాలకు డిజిటల్ సాంకేతికతను జోడించడం ద్వారా రైతులకు నిరంతర సమాచార సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రోత్సాహంతో 2002లో ఏర్పాటు చేయబడిన ఎన్ఐఎస్‌జీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న లాభాపేక్షలేని సంస్థ. ప్రభుత్వ రంగంలో ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టుల రూపకల్పన, అమలు, సాంకేతిక సహకారంలో ఈ సంస్థకు విస్తృత అనుభవం ఉందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్ ఐఏఎస్, వ్యవసాయ శాఖ సంచాలకులు  బి. గోపి , ఇతర ఉన్నతాధికారులు, ఎన్ఐఎస్‌జీ సీనియర్ జనరల్ మేనేజర్ షేక్ రషీద్ భాష తదితరులు పాల్గొన్నారు.