ఘనంగా ప్రారంభమైన బొగ్గు నాణ్యత వారోత్సవాలు 2026
ఘనంగా ప్రారంభమైన బొగ్గు నాణ్యత వారోత్సవాలు 2026
కొత్తగూడెం సింగరేణి, సూర్య(మేజర్ న్యూస్)- సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో ఈనెల 12 నుండి 18వ తేదీ వరకు నిర్వహించనున్న బొగ్గు నాణ్యత వారోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సి.హెచ్. వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, బొగ్గు నాణ్యత విషయంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.గత అక్టోబర్ నెలలో నిర్దేశించిన లక్ష్యాల్లో కొత్తగూడెం ఏరియా 75 శాతం లక్ష్యాన్ని సాధించిందని, కొత్తగూడెం ఏరియాలో గ్రేడ్ సంతృప్తి 75.25 శాతంగా నమోదైందని తెలిపారు. అదేవిధంగా సత్తుపల్లి ఏరియాలో గ్రేడ్ సంతృప్తి 81.5 శాతంగా నమోదైందని పేర్కొన్నారు.బొగ్గు నాణ్యతను మరింత మెరుగుపరచడం, నిర్దేశించిన గ్రేడ్‌కు అనుగుణంగా బొగ్గును ఉత్పత్తి చేయడం, నాణ్యతా ప్రమాణాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయడం ద్వారా వినియోగదారుల సంతృప్తిని పెంపొందించాలని సూచించారు.బొగ్గు నాణ్యత అనేది సంస్థ ప్రతిష్ఠతో పాటు వినియోగదారుల విశ్వాసానికి సంబంధించిన ముఖ్యమైన అంశమని, ప్రతి అధికారి, ఉద్యోగి నాణ్యతా ప్రమాణాల పరిరక్షణకు బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ వారోత్సవాల సందర్భంగా బొగ్గు నాణ్యతపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలను నిర్వహిస్తూ, మెరుగైన ఫలితాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఓ. టు జి.ఎం. గోవిందరావు, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి జె. గట్టయ్య, ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. రజాక్, ఏరియా ఇంజనీర్ (ఏజీఎం) రామకృష్ణ, డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్) రాజేందర్ కుమార్, పి.ఓ. వీకే.సీఎం శంకర్, క్వాలిటీ డిప్యూటీ జనరల్ మేనేజర్ కె. సత్యనారాయణ రాజు, పర్సనల్ మేనేజర్ తిరుపతి, సర్వే విభాగాధిపతి డి. వెంకటేశ్వర్లు, పర్యావరణ విభాగాధిపతి ఎం.డి. ఫజల్ రెహమాన్‌తో పాటు ఏరియా సెక్యూరిటీ అధికారి అభిలాష్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.