*కార్తీకమాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం మధిర డిపో నుంచి ప్రత్యేక బస్సులు*
సూర్య న్యూస్, మధిర
కార్తీకమాసం సందర్భంగా శివాలయాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మధిర డిపో ఆధ్వర్యంలో పంచారామాలు, అన్నవరం శబరిమల యాత్రలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు మధిర డిపో మేనేజర్ ఒక ప్రకటన లో తెలిపారు.
*పంచారామాల యాత్ర:*
నవంబర్ 15, 22, 29 తేదీలతో పాటు డిసెంబర్ 6వ తేదీన ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు మధిర నుంచి పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట కు ప్రత్యేక డీలక్స్ బస్సులు కలవు నడపబడతాయి.ఆన్లైన్ రిజర్వేషన్ కొరకు *సర్వీస్ నంబర్ 98927.*
అదేవిధంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 23వ తేదీన కూడా ప్రత్యేక డీలక్స్ బస్సు సౌకర్యం కల్పించబడుతుంది.
*పంచారామాల దర్శనానికి*
*చార్జీల వివరములు* పెద్దలకు రూ.2,000/- పిల్లలకు రూ.1,020/-
*అన్నవరం యాత్ర:*
కార్తీకమాసం సందర్భంగా నవంబర్ 15, 22, 29 తేదీలతో పాటు డిసెంబర్ 6వ తేదీన ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు మధిర నుంచి అన్నవరం క్షేత్రానికి ప్రత్యేక డీలక్స్ బస్సులు నడపబడతాయి.
*చార్జీల వివరములు*
పెద్దలకు రూ.770/-
పిల్లలకు రూ.430/-
*శబరిమల యాత్రకు ప్రత్యేక బస్సులు:*
శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం మధిర డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయబడుతున్నాయి. 36 మంది ఒక బ్యాచ్‌గా వస్తే సూపర్ లగ్జరీ బస్సు, 40 మంది ఒక బ్యాచ్‌గా వస్తే డీలక్స్ బస్సు ఏర్పాటు చేస్తారు.
ఇద్దరు మణికంఠ స్వాములకు, ఇద్దరు వంట మనుషులకు, సహాయకునిగా ఒక వ్యక్తికి సీట్లు లేకుండా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించబడుతుంది. అలాగే గురుస్వామి బస్సు బుక్ చేస్తే గురు స్వామికి ఉచిత ప్రయాణం కల్పించబడును. గురుస్వామి ఒక బస్సు కంటే ఎక్కువ బస్సులుబుక్ చేస్తే యాత్రారోజుల బట్టి గురుస్వామికి రూ.300/- ఇవ్వబడును.
*భక్తుల కోరిక మేరకు శ్రీశైలం, వేదాద్రి ,వేములవాడ, అరుణాచలం, గోల్డెన్ టెంపుల్ మొదలైన పుణ్యక్షేత్రాలకు 40 మంది అంతకంటే ఎక్కువ మంది ఉంటే ఏరోజైనా బస్సు సౌకర్యం కల్పించబడును.*
భక్తులు, ప్రయాణికులు ఈ ప్రత్యేక బస్సు సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు.
రిజర్వేషన్ల కోసం క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించగలరు.
9908166892, 9866208233, 9908367066, 9959225961