BREAKING
మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ నైజాం రైట్స్ సంచలనం.. రూ.35 కోట్ల భారీ డీల్‌ను దక్కించుకున్న ఏషియన్ సినిమాస్! కరువు రైతులకు రుణ ఉపశమనం కల్పించాలి! బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి..జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ సూచనలు ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి శాంతిభద్రతలకే కార్డెన్ సెర్చ్. శాంతిభద్రతలకే కార్డెన్ సెర్చ్. నర్సరీ రైతు మార్గాని సత్యనారాయణకు యూనియన్ బ్యాంక్ పురస్కారం వారణాసి సినిమా ఓటీటీ రైట్స్ సంచలనం.. రూ.500 కోట్ల రికార్డు బిజినెస్‌పై టాలీవుడ్‌లో జోరుగా చర్చ! ఖైదీల సమస్యలు తెలుసుకున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఎవరు..? ఆశావాహుల పేర్లు శాంతాడంత.... ఎమ్మెల్యే ఎవరికి ఓకే అంటే వారే అభ్యర్థి... పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలి పత్తి సాగుపై రైతులకు అవగాహన భూ రీ సర్వే పనులు వేగవంతంగా పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి గురుకుల విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులు యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదల సాధ్యం కాదు : కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి

Select Suryaa Now
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన  జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి

పల్నాడు జిల్లా : రానున్న గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి బెల్లంకొండ, మాచవరం పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్నికల భద్రతకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావ ళిని కచ్చితంగా అమలు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిర్వహించేందుకు పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ స్పష్టం చేశారు.

 మల్లికార్జున్ రావు పల్నాడు జిల్లా ఇన్చార్జి