BREAKING
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇచ్చిన ఆ సలహానే నాకు శ్రీరామరక్ష.. యంగ్ పేసర్ ఆకిబ్ నబీ కీలక వ్యాఖ్యలు! 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు -రాష్ట్రంలోనే నెంబర్-1 గా నిర్వహించాలి: చైర్మన్ డా.రెడ్డివారి గురువారెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించిన కౌన్సిలర్ రాము దోమతెరలతో వ్యాధులు దూరం - డాక్టర్ బేతం హర్ష జాతీయ స్థాయి పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన సంచలన పేసర్‌కు పిలుపు.. భారత్‌తో ఆఖరి రెండు వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన! ఐపీఎల్‌లో 12 జట్లు, రూ.150 కోట్ల పర్స్‌.. విస్తరణ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంచలన క్లారిటీ! ఘనంగా ముగిసిన జాతీయ వర్క్ షాప్ మాంస ఉత్పత్తులతో స్టార్టప్ లకు మార్గం: డా. బి.శోభామణి కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధం! గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ శర్మ రికార్డులు.. నాలుగో వన్డేలో అదరగొట్టేందుకు సిద్ధం! ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్.. శ్రీలంక జట్టు ప్రకటన, కెప్టెన్‌గా పవన్ రత్నాయకే! ఉపాధ్యాయ వృత్తికే-కళంకం అండర్-19 ఆసియా కప్ సెమీస్‌లో చెలరేగిన సెహ్వాగ్‌ తనయుడు.. అర్ధశతకంతో అదరగొట్టిన ఆర్యవిర్!

మౌలిక వసతుల కల్పనతోనే సమగ్రాభివృద్ధి సాధ్యం

Select Suryaa Now
మౌలిక వసతుల కల్పనతోనే సమగ్రాభివృద్ధి సాధ్యం

మౌలిక వసతుల కల్పనతోనే సమగ్రాభివృద్ధి సాధ్యం
- ప్రతి డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
- కార్పొరేషన్ లో వంద శాతం డ్రెయిన్లు, రోడ్లు పూర్తి చేస్తాం 
- ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

​పాల్వంచ, సూర్య(మేజర్ న్యూస్)- మౌలిక వసతుల కల్పనతోనే ప్రాంతాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక బద్ధంగా ముందడుగు వేస్తున్నామని కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ పట్టణంలో రూ. 47.81 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.  8వ డివిజన్ అయ్యప్ప నగర్‌లో రూ. 14 లక్షలతో రోడ్డు, డ్రైన్ విస్తరణకు, శ్రీనివాస కాలనీలో రూ. 13.90 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైన్ పనులకు భూమిపూజ చేశారు. వీటితో పాటు అయ్యప్ప నగర్-ఒడ్డుగూడెం పరిధిలో రూ. 5.95 లక్షలు, 45వ డివిజన్ ఒడ్డుగూడెంలో రూ. 3.96 లక్షలతో స్లాబ్ కవర్లు, కల్వర్టు నిర్మాణం, 36వ డివిజన్ గట్టాయిగూడెంలో రూ. 10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలోని ప్రతి బస్తీలో రహదారులు, మురుగునీటి కాలువల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. నిధుల కొరత లేకుండా కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. మంజూరైన అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు ఎక్కడా రాజీ పడకుండా అత్యంత నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. పనుల పురోగతిని స్థానిక నాయకులు, అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి. ఎస్ కే సాబీర్ పాషా కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్ డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి తాసిల్దార్ దారా ప్రసాద్ వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు  కార్పొరేటర్స్ ఆడుసు మిల్లి సాయిబాబు. వీసంశెట్టి విశ్వేశ్వరరావు గుర్రం వెంకటేశ్వర్లు దంతెబోయిన నరేష్ పగిడిపల్లి జయలక్ష్మి సిపిఐ మండల కార్యదర్శి
వీసంశెట్టి పూర్ణచంద్రరావు 
కాంగ్రెస్ నాయకులు ఎర్రం శెట్టి ముత్తయ్య కొండం వెంకన్న తెలుగుదేశం నాయకులు కనగాల అనంత రాములు చల్లగుండ్ల  వీరభద్రం వీసంశెట్టి పద్మజ దుగ్గిరాల సుధాకర్ అన్నారపు వెంకటేశ్వర్లు ఇట్టి వెంకట్రావు శనగరపు శ్రీనివాసరావు గౌతమి కృష్ణ యాకయ్య ఆలపాటి ప్రసాద్ నామ పండు నామ నవీన్ దినేష్  రవీందర్ లాల్ పాషా ఆదినారాయణ మున్సిపాలిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు