BREAKING
యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదల సాధ్యం కాదు : కలెక్టర్ పంచాయతీ ఎన్నికల అధికారులకు శిక్షణ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : కలెక్టర్ మున్సిపల్ కమీషనర్ కు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సూచన ఆలయాలకు కార్తీక మాసం సందడి రైతులు రీ సర్వేకు సహకరించాలి - చామనపల్లి ముంపు గ్రామ తరలింపు మూడు నెలల్లో పూర్తి చేయాలి కడియం వంతెనపై భారీగా ట్రాఫిక్ జామ్‌.. పట్టించుకునే పోలీసులేరీ? కడియం వంతెనపై భారీగా ట్రాఫిక్ జామ్‌.. పట్టించుకునే పోలీసులేరీ? ఇరుసుమండలో రైతులకు సదస్సు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన పరిశ్రమల స్థాపన దేశ ప్రగతికి సోపానం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కార్తీక స్నానాలకు బ్రాహ్మణ రేవు అనుకూలం కాదా? సేంద్రీయ సాగును ప్రోత్సహిద్దాం.. చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికలు ప్రారంభం అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి వర్షిత్‌కు జగన్‌మోహన్‌రెడ్డి భరోసా

ఉపాధ్యాయ వృత్తికే-కళంకం

Select Suryaa Now
ఉపాధ్యాయ వృత్తికే-కళంకం

చిత్తూరు జిల్లా వి.కోట: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు గాడి తప్పాడు..విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిపెట్టాడు. వివరాల్లోకి వెళితే వి.కోట మండలం వి.కోట బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు రమేష్ విధులు నిర్వహిస్తున్నాడు. మూడేళ్లుగా ఈ పాఠశాలలో పనిచేస్తున్నాడు.ఆరవ తరగతి,ఏడవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.విద్యార్థులు శరీర అంగాలపై చేతులు వేయడం,నిమరడం, నాతో ఎందుకు మాట్లాడడం లేదంటూ దొంగ అర్థాలతో సైగలు చేయడం లాంటివి చేస్తున్నాడు.విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.విషయాన్ని తల్లిదండ్రులకు చేరవేశారు. తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ విచారణకు ఆదేశించాడు. గురువారం ఉప విద్యాశాఖ అధికారి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విచారణకు విచ్చేశారు. ఫిర్యాదు చేసిన తరగతులు వదిలి ఇతర తరగతులలో విచారణ చేపట్టడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ సక్రమంగా జరగడంలేదని మండిపడ్డారు.విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి, ఆర్జెడి కడప అధికారి దృష్టికి ఫోన్ ద్వారా తీసుకెళ్లారు.స్పందించిన అధికారి డిప్యూటీ విద్యాశాఖ అధికారిని సక్రమంగా విచారించాలని ఆదేశించారు.దీంతో బాధిత విద్యార్థులను విచారించి వివరాలను రాతపూర్వకంగా సేకరించారు. ఉపాధ్యాయుడు చేష్టలపై హెడ్మాస్టర్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు.ఆ ఉపాధ్యాయుడు అలాంటివాడు కాదంటూ వెనకేసుకొచ్చాడని తల్లిదండ్రులు వాపోయారు. విద్యార్థినులు సైతం తమ జరుగు తమకు జరిగిన అన్యాయాన్ని పాత్రికేయుల ముందు వివరించారు. విధుల నుంచి తొలగించాలని..మా పాఠశాలల్లో ఆయన సేవలు అవసరం లేదంటూ విద్యార్థులు చెప్పడం ఆయన చేష్టలకు నిదర్శనం. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు జిల్లాలోనే మంచి పేరు ఉంది.అయితే ప్రస్తుతం హెడ్మాస్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న దామోదర్ నాయుడు విధులు చేపట్టిన కాలం నుండి పాఠశాల వివాదాల కేంద్రంగా మారింది.ఆయన నిర్ణయాలు, వ్యవహార శైలి విద్యార్థినులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పట్ల అసౌకర్యంగా ఉన్నాయి.పాఠశాలలో జరిగే అకృత్యాలను విద్యార్థులు తల్లితండ్రులకు దృష్టికి తీసుకెళ్తారని ముందుగానే గ్రహిస్తాడు.వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే మీ కథ తేలుస్తానని బెదిరింపులకు సైతం దిగారని తల్లితండ్రులు చెబుతున్నారు.గతంలో హెడ్మాస్టర్ తీరుపైన జిల్లా కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదులు అందాయి.విచారణ పేరుతో కాలయాపన చేస్తూ రాజకీయ అండతో వాటి నుంచి బయటపడాడని ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులను సైతం నా పవర్ నీకు తెలీదని, పదవి నుండి తొలగిస్తామని హెచ్చరించినట్లు కూడా సమాచారం.పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉపాధ్యాయులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో పని చేయలేక.. విషయం బయటకు చెప్పుకోలేక మదన పడుతున్నారు.బదిలీలు వస్తే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఉపాధ్యాయునులే ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారంటే..ఇక విద్యార్థులకు వీరి చేష్టలు ఎలా ఉంటాయో అర్థమవుతోంది.. ఇప్పటి వరకు మూడుసార్లుగా విచారణ చేశారు.ఏమి నివేదికలు ఇచ్చారు. ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తల్లితండ్రులు డివైఈవో నిలదీస్తే..సమాధానం దాటవేశారు..నివేదిక ఇస్తాను..చర్యలు ఎవరు తీసుకుంటారో నాకు సంబంధం లేదంటూ అధికారి ఇక్కడి నుంచి వెళ్లిపోవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యార్థునులకు రక్షణ,భద్రత ఎక్కడుందని తల్లితండ్రులు నిలదీస్తున్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందించి అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడి,ఆయనను వేనకేసుకు వస్తున్నా హెడ్మాస్టర్ పై చర్యలు తీసుకోకపోతే విద్యార్థుల తల్లితండ్రులు ఉద్యమానికి శ్రీకారం చుడతామని చేపడతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు,సభ్యులు, విద్యార్తునుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సురేంద్ర, సీనియర్ రిపోర్టర్, 

వి. కోట