BREAKING
వెయ్యి కోట్ల క్లబ్‌లో రామాయణం.. మేకింగ్ ఫొటోలతో రవి దూబే జోష్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన కుందన లీడిట్ పరిశ్రమ ప్రతినిధులతో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ కీలక చర్చలు భారత్ - శ్రీలంక మధ్య సాంకేతిక భాగస్వామ్యం రాజమహేంద్రవరం కు ఎన్నికల నేపాల్‌లో లోయలో పడిన ఎలక్ట్రిక్ వాహనం.. పద్నాలుగు మంది మృతి యూఏఈ తీరంలో ప్రక్షేపక దాడికి గురైన చమురు ట్యాంకర్ సైనిక వీరుల త్యాగాలకు సరికొత్త హంగులతో గాలంట్రీ అవార్డ్స్ పోర్టల్ ప్రారంభం శ్రీ మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి దంపతులు దేశవ్యాప్తంగా 'ఒక దేశం - ఒక రేషన్ కార్డు' పథకం భారతీయుడు 2 షూటింగ్ ప్రమాదంపై కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ రోజు త్రుటిలో ప్రాణాలు దక్కాయి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని కుందన రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స ప్రధానమంత్రి 'పీఎం రాహత్' పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి.. రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు తండ్రి గురించి తరుణ్ భాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. ఆ మాటలు వింటే కన్నీళ్లాగవు

కడియం వంతెనపై భారీగా ట్రాఫిక్ జామ్‌.. పట్టించుకునే పోలీసులేరీ?

Select Suryaa Now
కడియం వంతెనపై భారీగా ట్రాఫిక్ జామ్‌.. పట్టించుకునే పోలీసులేరీ?

                             వంతెనకు ఇరువైపులా చిరు వ్యాపారుల ఆక్రమణలతో మరింత సమస్య..

 కడియం ,మేజర్ న్యూస్,:మండల కేంద్రమైన కడియం వంతెనపై ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. తాజాగా వంతెనపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాల రాకపోకలు పూర్తిగా మందగించి ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు..మరోవైపు వంతెనకు ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారులు తమ వ్యాపారాల వద్దకు వచ్చే వినియోగదారుల కోసం రహదారిపైనే బండ్లు నిలపడం, వాహనాలను అడ్డంగా నిలిపివేయడం ట్రాఫిక్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. ఇప్పటికే ఇరుకుగా ఉండే వంతెన మార్గంలో ఈ ఆక్రమణలు తోడవడంతో ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. చిరు వ్యాపారాల నిర్వహణకు ఇబ్బంది లేకుండా చూడటంతో పాటు ప్రజా రహదారిపై వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ వంతెనపై రద్దీ సమయాల్లో ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిపై అడ్డంకులను తొలగించి, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.