BREAKING
రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన కుందన లీడిట్ పరిశ్రమ ప్రతినిధులతో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ కీలక చర్చలు భారత్ - శ్రీలంక మధ్య సాంకేతిక భాగస్వామ్యం రాజమహేంద్రవరం కు ఎన్నికల నేపాల్‌లో లోయలో పడిన ఎలక్ట్రిక్ వాహనం.. పద్నాలుగు మంది మృతి యూఏఈ తీరంలో ప్రక్షేపక దాడికి గురైన చమురు ట్యాంకర్ సైనిక వీరుల త్యాగాలకు సరికొత్త హంగులతో గాలంట్రీ అవార్డ్స్ పోర్టల్ ప్రారంభం శ్రీ మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి దంపతులు దేశవ్యాప్తంగా 'ఒక దేశం - ఒక రేషన్ కార్డు' పథకం భారతీయుడు 2 షూటింగ్ ప్రమాదంపై కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ రోజు త్రుటిలో ప్రాణాలు దక్కాయి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని కుందన రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స ప్రధానమంత్రి 'పీఎం రాహత్' పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి.. రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు తండ్రి గురించి తరుణ్ భాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. ఆ మాటలు వింటే కన్నీళ్లాగవు మహిళలు, బాలికల భద్రతకు ‘షీ బాక్స్‌’లు ఫిర్యాదులు, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచాలి - జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్..

మున్సిపల్ కమీషనర్ కు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సూచన

Select Suryaa Now
మున్సిపల్ కమీషనర్ కు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సూచన

 

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్ : ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డి 85వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న ఆయన నివాసానికి పలువురు ప్రముఖులు వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి 15వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.1 కోటి 38 లక్షలు మంజూరు కావడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. పట్టణ అభివృద్ధికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, పట్టణంలో ప్రాధాన్యత కలిగిన అభివృద్ధి పనుల చేపట్టేందుకు ఈ నిధులను వినియోగించాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి సూచనల మేరకు, కౌన్సిల్ సమావేశంలో తీసుకునే నిర్ణయాల ప్రకారం పట్టణంలో అత్యవసరమైన, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిధులను ఖర్చు చేస్తూ ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయవచ్చని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.

షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా