ఇరుసుమండలో రైతులకు సదస్సు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన
అంబాజీపేట మేజర్ న్యూస్ :ఇరుసుమండ గ్రామంలో గురువారం గ్రామీణ అవగాహన కార్యక్రమం (రావేప్) లో భాగంగా రైతు సదస్సు వ్యవసాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.అంబాజీపేట,ఇరుసుమండ మరియు నేదునూరు మండల గ్రామాల రైతుల కోసం ఇరుసుమండలో కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్య అతిధిగా విచ్చేసిన అమలాపురం కోఆర్డినేటర్ ఎం.నందకిషోర్,పీఎల్ఆర్జే ప్రవీణ,నరసింహమూర్తి లు మాట్లాడుతూ
రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఎరువుల వాడకం, పురుగులు, తెగుళ్ల నివారణపై అవగాహన కల్పించారు. వ్యవసాయంలో పాటించాల్సిన మెళకువలు, యాజమాన్య పద్ధతులు, వ్యవసాయంలో కాలుష్యం మరియు నివారణ, మెరుగైన పద్ధతుల గురించి వివరించారు.ఎరువుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిఫార్సు చేసిన మోతాదులోనే ఎరువులు వాడాలని, మట్టి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జీవన ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను శాస్త్రవేత్తలతో చర్చించి, వారి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రైతులకు వ్యవసాయంపై ఉన్న విజ్ఞాన శాస్త్రం మరియు అవగాహనను పెంపొందించేలా రైతులకు అవగాహన కల్పించారు. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాల రాజమహేంద్రవరం విద్యార్థులు గ్రామంలోని రైతులను కలిసి వివరించే కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి, వ్యవసాయ శాఖ అధికారులు, సిహెచ్.సునీత, గ్రామ రైతులు, రావేప్ విద్యార్థులు పాల్గొన్నారు.