BREAKING
భారత్ - శ్రీలంక మధ్య సాంకేతిక భాగస్వామ్యం రాజమహేంద్రవరం కు ఎన్నికల నేపాల్‌లో లోయలో పడిన ఎలక్ట్రిక్ వాహనం.. పద్నాలుగు మంది మృతి యూఏఈ తీరంలో ప్రక్షేపక దాడికి గురైన చమురు ట్యాంకర్ సైనిక వీరుల త్యాగాలకు సరికొత్త హంగులతో గాలంట్రీ అవార్డ్స్ పోర్టల్ ప్రారంభం శ్రీ మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి దంపతులు దేశవ్యాప్తంగా 'ఒక దేశం - ఒక రేషన్ కార్డు' పథకం భారతీయుడు 2 షూటింగ్ ప్రమాదంపై కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ రోజు త్రుటిలో ప్రాణాలు దక్కాయి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని కుందన రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స ప్రధానమంత్రి 'పీఎం రాహత్' పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి.. రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు తండ్రి గురించి తరుణ్ భాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. ఆ మాటలు వింటే కన్నీళ్లాగవు మహిళలు, బాలికల భద్రతకు ‘షీ బాక్స్‌’లు ఫిర్యాదులు, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచాలి - జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.. సీతానగరం మండలంలో ప్రపంచ న్యూమోనియా దినోత్సవం ఓటీటీలోకి విశ్వక్ సేన్ కల్ట్ సినిమా.. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఆలయాలకు కార్తీక మాసం సందడి

Select Suryaa Now
ఆలయాలకు కార్తీక మాసం సందడి

అయినవిల్లి మేజర్ న్యూస్:బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలోని ప్రముఖ దేవాలయాలకు కార్తీక మాసం సందడి ఏర్పడింది ముఖ్యంగా అయినవిల్లి గ్రామంలో వేంచేసి ఉన్న  స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నిత్యం వేలాదిగా  భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఆలయం చుట్టుపక్కల భక్తులతో కిటకిటలాడుతుంది ఈ ఆలయంలో నిత్యాన్నదానం నిర్విఘ్నంగా కొనసాగటం భక్తులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు  అన్నప్రసాదాలు స్వీకరించి తృప్తి చెందుతున్నారు భక్తుల విరాళాల ద్వారా వచ్చిన సొమ్ముతో దేవస్థానం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కార్తీక మాసం పర్వదినం నెల రోజులు ఉదయం నుండి సాయంత్రం వరకు యాత్రికులు నిత్యం వస్తూ ఉంటారు ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి వారు శ్రీ విశ్వేశ్వర స్వామి వారు అన్నపూర్ణ దేవి ఆలయాలు నెలకొని ఉండటంతో భక్తులు తరిస్తున్నారు

శ్రీరామచంద్రమూర్తిసే ప్రతిష్టించబడిన ముక్తేశ్వరం శ్రీముక్తి కాంతా సమేత క్షణముక్తేశ్వర స్వామి వారు  ఆలయం కార్తీకమాసం పర్వదినాల నెల రోజులు లక్ష బిల్వార్చనలతో మార్మోగుతుంది శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి వారి ఆలయం ధనలక్ష్మి అమ్మవారు ఉండటం ఆలయం ప్రత్యేకత అయినవిల్లి శ్రీవిఘ్నేశ్వర స్వామి ఆలయం శ్రీముక్తి కాంత క్షణముక్తేశ్వర స్వామి వారి ఆలయం పురాతన దేవాలయాలు కావటం ఈ ప్రాంతం దివ్య క్షేత్రాలుగా కొలబడుతుంది శ్రీముక్తి కాంత క్షణం ముక్తేశ్వర స్వామి వారి ఆలయం ద్వారా ఈ ప్రాంతానికి ముక్తేశ్వరం అనే పేరు వచ్చింది గౌతమి గోదావరి నది ఒడ్డున గల ఈ ఆలయాలు నిత్యం భక్తులతో కళకళలాడుతుంటాయి  దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాలయాల నిర్వహణ జరుగుతుంది