BREAKING
భూ రీ సర్వే పనులు వేగవంతంగా పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి గురుకుల విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులు యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదల సాధ్యం కాదు : కలెక్టర్ పంచాయతీ ఎన్నికల అధికారులకు శిక్షణ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : కలెక్టర్ మున్సిపల్ కమీషనర్ కు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సూచన ఆలయాలకు కార్తీక మాసం సందడి రైతులు రీ సర్వేకు సహకరించాలి - చామనపల్లి ముంపు గ్రామ తరలింపు మూడు నెలల్లో పూర్తి చేయాలి కడియం వంతెనపై భారీగా ట్రాఫిక్ జామ్‌.. పట్టించుకునే పోలీసులేరీ? కడియం వంతెనపై భారీగా ట్రాఫిక్ జామ్‌.. పట్టించుకునే పోలీసులేరీ? ఇరుసుమండలో రైతులకు సదస్సు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన పరిశ్రమల స్థాపన దేశ ప్రగతికి సోపానం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కార్తీక స్నానాలకు బ్రాహ్మణ రేవు అనుకూలం కాదా? సేంద్రీయ సాగును ప్రోత్సహిద్దాం..

ఒకవైపు గుంతలు బాబోయ్.. మరోవైపు దుర్వాసన! పూతలపట్టు నుండి పోలవరం వెళ్లే రోడ్డు పరిస్థితి ఇది.. ఇటుపక్క వెళ్లలేకపోతున్నాం మొర్రో అంటున్న వాహనదారులు, స్థానికులు

Select Suryaa Now
ఒకవైపు గుంతలు బాబోయ్.. మరోవైపు దుర్వాసన!  పూతలపట్టు నుండి పోలవరం వెళ్లే రోడ్డు పరిస్థితి ఇది..   ఇటుపక్క వెళ్లలేకపోతున్నాం మొర్రో అంటున్న వాహనదారులు, స్థానికులు

పూతలపట్టు మేజర్ న్యూస్ :

ప్రజలకు నిత్యం రాకపోకలకు సౌకర్యంగా ఉండాల్సిన ప్రధాన రహదారులు నేడు సమస్యలకు నిలయంగా మారాయి పూతలపట్టు నుండి పోలవరం వెళ్లే ప్రధాన రహదారి కొన్ని చోట్ల తీవ్రంగా అధ్వాన్నంగా తయారవడంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, కాలినడకన వెళ్లే స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఒకవైపు అడుగుకో గుంతతో దెబ్బతిన్న రోడ్డు, మరోవైపు రోడ్డు పక్కనే పేరుకుపోయిన చెత్తకుప్పల నుండి వస్తున్న భరించలేని దుర్వాసనతో ఇటుపక్కకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పూతలపట్టు నుండి పోలవరం వెళ్లే మార్గంలో రోడ్డు పూర్తిగా కోతకు గురై, అంచులన్నీ విరిగిపోయి కంకర తేలడంతో పాటు రోడ్డు మధ్యలో, అంచుల్లో పెద్దపెద్ద గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిత్యం వివిధ పనుల నిమిత్తం ఈ మార్గుండా రాకపోకలు సాగించే గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు, ఆటోలు ఈ గుంతల్లో పడి తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. పగటిపూట ఏదో ఒకలా తప్పించుకుని వెళ్తున్నా, రాత్రి సమయాల్లో వీధి దీపాల వెలుతురు సరిగ్గా లేకపోవడంతో రోడ్డు ఎక్కడుందో, గుంత ఎక్కడుందో తెలియక వాహనదారులు కిందపడి గాయాలపాలవుతున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయని వాహనదారులు చెబుతున్నారు   రోడ్డు దుస్థితి ఒక ఎత్తయితే, రోడ్డు పక్కన ఉన్న చెత్తతొట్టి నిండిపోయి, చెత్తంతా రోడ్డుపైకి విస్తరించడం మరో పెద్ద సమస్యగా మారి ప్లాస్టిక్ వ్యర్థాలు, కుళ్లిపోయిన పదార్థాలు రోజుల తరబడి పేరుకుపోవడంతో ఆ ప్రాంతమంతా భరించలేని దుర్వాసన వెదజల్లుతోంది. ఆ మార్గంలో వెళ్లే ప్రతి ఒక్కరూ ముక్కు మూసుకుని పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొందని స్థానికలు చెబుతున్నారు దీనికి తోడు, ఈ చెత్త కుప్పల వద్ద ఆహారం కోసం వీధి కుక్కలు గుంపులుగా చేరి స్వైరవిహారం చేస్తూ చెత్తను రోడ్డుపైకి లాగుతున్నాయి అటుగా వెళ్లే పాదచారులపైకి, ద్విచక్ర వాహనదారులపైకి కుక్కలు దూకుతుండటంతో స్థానికులు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడవాల్సి వస్తోందని,రోడ్డుకు ఇరువైపులా పిచ్చిమొక్కలు, తుప్పలు ఏపుగా పెరిగిపోవడంతో విషసర్పాలు, కీటకాలు సంచరించే ప్రమాదం కూడా పొంచి ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ప్రజలు, వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో ఇంతటి అపరిశుభ్రత తాండవిస్తుండటం, దోమలు, ఈగలు పెరిగిపోయి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఉండటం పట్ల ప్రయాణికులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు, స్పందించి తక్షణమే రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తను తొలగించి బ్లీచింగ్ చల్లించాలని, అలాగే దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టి తమ ప్రాణాలను, ఆరోగ్యాన్ని కాపాడాలని పూతలపట్టు - పోలవరం మార్గవాసులు, వాహనదారులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

పూతలపట్టు రిపోర్టర్ దిలీప్ కుమార్